వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-27T04:33:11+05:30 IST

భార్యాభర్తల గొడవల నడుమ మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం స్థానిక కృషి బైపాస్‌ రోడ్‌లో చోటుచేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

సత్తుపల్లిరూరల్‌, నవంబరు 26: భార్యాభర్తల గొడవల నడుమ మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం స్థానిక కృషి బైపాస్‌ రోడ్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ జీ.నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి ఓసీ ఉద్యోగి మాడూరి సందీప్‌కుమార్‌, స్పందన (25)దంపతులు.. గురువారం వారు గొడవపడ్డారు. మనస్థాపానికి గురైన స్పందన ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-11-27T04:33:11+05:30 IST