వివేకా హత్య కేసు విచారణలో ముందడుగు.. కడపకు చేరుకున్న విచారణాధికారి

ABN , First Publish Date - 2022-09-23T17:36:48+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణలో ఒక ముందడుగు పడింది.

వివేకా హత్య కేసు విచారణలో ముందడుగు.. కడపకు చేరుకున్న విచారణాధికారి

Kadapa : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణలో ఒక ముందడుగు పడింది. ఈ కేసు కోసం ఢిల్లీ (Delhi) నుంచి సీబీఐ (CBI) విచారణ అధికారి రామ్ సింగ్.. కడపకు చేరుకున్నారు. 5 నెలల విరామం తర్వాత ఢిల్లీ నుంచి రామ్ సింగ్ కడపకు వచ్చారు. రామ్‌సింగ్ రాకతో పులివెందుల(Pulivendula)లో విచారణ ఎదుర్కొంటున్న అనుమానితుల్లో టెన్షన్ మొదలైంది. మరికాసేపట్లో విచారణ కోసం రామ్ సింగ్ పులివెందులకు వెళ్లే అవకాశం ఉంది. 


కాగా.. వివేకా హత్య కేసు (Viveka murder case) విచారణ ఆరు నెలల తర్వాత తిరిగి రెండు రోజుల క్రితం ప్రారంభమైంది. రెండు రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం (R&B Guest House)లో వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను ప్రశ్నించారు. కాగా.. ఇటీవల తన తండ్రి హత్య కేసు విచారణకు ఏపీలో అడ్డంకులు సృష్టిస్తున్నారని కాబట్టి దానిని హైదరాబాద్‌ (Hyderabad)కు బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత (Sunitha) వేసిన పిటిషన్‌పై నిన్న సుప్రీంలో విచారణ జరిగింది. ఈ కేసులో సాక్షులు, సీబీఐ అధికారులకు వస్తున్న బెదిరింపులపై అక్టోబరు 14లోగా సమాధానం ఇవ్వాలంటూ సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. 


Updated Date - 2022-09-23T17:36:48+05:30 IST