వివేకానంద డేకు నిజామాబాద్‌ విద్యాసంస్థల మద్దతు

ABN , First Publish Date - 2021-12-24T04:06:30+05:30 IST

నిజామాబాద్: ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు అనూహ్య మద్దతు లభిస్తోంది.

వివేకానంద డేకు నిజామాబాద్‌ విద్యాసంస్థల మద్దతు

నిజామాబాద్: ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, యువత చేస్తున్న క్యాంపెయిన్‌కు అనూహ్య మద్దతు లభిస్తోంది. తెలంగాణ నలుమూలలకూ క్యాంపెయిన్ విస్తరిస్తున్న తరుణంలో నిజామాబాద్‌లోని పలు విద్యాసంస్థలు వివేకానంద డేకు మద్దతు తెలిపాయి. నిజామాబాద్ శివాజీనగర్‌లోని శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్ కరెస్పాండెంట్ సముద్రాల శ్రీనివాసాచార్యులు, ప్రిన్సిపల్ శశిరేఖ వివేకానంద డేకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం వాలంటీర్లు మాధవి, నారాయణ రావు ఫిబ్రవరి 13 ప్రాధాన్యతను విద్యార్ధులకు వివరించారు. 



నిజామాబాద్‌లోని ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గోనె గోవర్ధన్ రెడ్డి వివేకానంద డేకు మద్దతు తెలుపుతూ స్వామి వివేకానంద పోస్టర్‌పై సంతకం పెట్టారు. రామకృష్ణ మఠం వాలంటీర్లు మాధవి, మాధురి సముద్రాల విద్యార్ధులకు ఫిబ్రవరి 13 ప్రాధాన్యతను వివరించారు. 


నిజామాబాద్‌లోని ఎస్‌వీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హరిప్రసాద్ వివేకానంద డేకు మద్దతు తెలిపారు. ఫిబ్రవరి 13 ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రత్యేకంగా రూపొందించిన స్వామి వివేకానంద పోస్టర్‌పై ఆయన సంతకం పెట్టారు. 


నిజామాబాద్‌లోని నిశిత డిగ్రీకాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర సాగర్ వివేకానంద డేకు మద్దతు తెలుపుతూ స్వామి వివేకానంద పోస్టర్‌పై సంతకం పెట్టారు. రామకృష్ణ మఠం వాలంటీర్లు మాధవి, మాధురి సముద్రాల విద్యార్ధులకు ఫిబ్రవరి 13 ప్రాధాన్యతను వివరించారు. విద్యార్ధులు కూడా ఆన్‌లైన్ ద్వారా క్యాంపెయిన్‌కు మద్దతు తెలిపారు.  


1893లో హైదరాబాద్ పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద సికింద్రాబాద్‌లోని మహబూబ్ కళాశాలలో ఫిబ్రవరి 13న మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై ప్రసంగించారు. యూరోపియన్లు, నిజాం కొలువులోని మేధావులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న బహిరంగసభను ఉద్దేశించి వివేకానంద తొలిసారిగా ఆంగ్లంలో ప్రసంగించారు. సభ విజయవంతం కావడంతో వివేకానందలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. అదే స్ఫూర్తితో ఆయన చికాగో వేదికపై ప్రసంగించి విజయవంతమయ్యారు. వివేకానందలో ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేసిన ఫిబ్రవరి 13ను వివేకానంద దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలని రామకృష్ణ మఠం వాలంటీర్లు కోరుతున్నారు. ప్రతియేటా ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు వారోత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి అందరి మద్దతునూ కూడగడుతున్నారు. 



Updated Date - 2021-12-24T04:06:30+05:30 IST