అద్భుత ఫీచర్లతో వివో వి20 స్మార్ట్‌ఫోన్‌..

ABN , First Publish Date - 2020-12-01T22:13:04+05:30 IST

అద్భుత ఫీచర్లతో వివో వి20 స్మార్ట్‌ఫోన్‌..

అద్భుత ఫీచర్లతో వివో వి20 స్మార్ట్‌ఫోన్‌..

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. భారత మార్కెట్‌లో డిసెంబర్ 2వ తేదీన వివో వి20 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.


అయితే వివో వి20 స్మార్ట్‌ఫోన్‌ విడుదలకు ముందే విక్రయ సంస్థ ఫోన్ల ధరలను వెల్లడించాయి. రిలయన్స్ డిజిటల్, పూర్వికా మొబైల్, సంగీత మొబైల్స్ వెబ్‌సైట్లు రూ. 29,990 ఉండొచ్చని అంచనా వేశాయి. భారత్‌లో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రూ. 29,990 ఉంటుందని అంచనా వేశాయి. ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులు ఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. అయితే ముందస్తుగా ఫోన్ల కోసం కస్టమర్లు రూ.2000 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Updated Date - 2020-12-01T22:13:04+05:30 IST