‘ఉక్కు’ ఉద్యమం ఉధృతం

Sep 22 2021 @ 03:28AM

సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ బినోయ్‌ పిలుపు

ఉప రాష్ట్రపతి చొరవ చూపాలి: కె.నారాయణ


కూర్మన్నపాలెం (విశాఖపట్నం), సెప్టెంబరు 21: విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం కార్మికులు చేపట్టిన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని రాజ్యసభ సభ్యుడు, సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి బినోయ్‌విశ్వం పిలుపునిచ్చారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఈ నెల 27న తలపెట్టనున్న భారత్‌ బంద్‌కు మద్దతుగా మంగళవారం జింక్‌ గేటు నుంచి కూర్మన్నపాలెం ఆర్చ్‌ వరకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కూర్మన్నపాలెం కూడలిలో ఏర్పాటుచేసిన సభలో బినయ్‌విశ్వం మాట్లాడారు. ఉక్కు విషయంలో రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఎవరితోనైనా కలసి పోరాటం చేస్తామని ప్రకటించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి హోదా లో వెంకయ్యనాయుడు విశాఖ ఉక్కు సమస్యను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్‌ అఖిలపక్ష రాజకీయ ప్రతినిధులను ప్రధాని వద్దకు తీసుకువెళ్లి, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు పాటుపడాలన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.