యువత దృష్టి సారించాల్సిన 8 అంశాలు

ABN , First Publish Date - 2022-04-21T21:43:30+05:30 IST

దేశ ప్రజలను జాగృతం చేసి, వారిలో మరుగున పడిపోయిన సంఘ శక్తి, క్రమశిక్షణ. దేశ భక్తిని మేల్కొలపడమే లక్ష్యంగా వివేకానందుడు

యువత దృష్టి సారించాల్సిన 8 అంశాలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి): 


దేశభక్తిని మేల్కొలపడమే రామకృష్ణ మిషన్‌ లక్ష్యం 

ప్రపంచ వ్యాప్తంగా 275కు పైగా కేంద్రాలతో సేవలు

సమాజ సేవలో వేయి మంది సన్యాసులు 

వ్యక్తిత్వ వికాసంలో యువతకు నిరంతర శిక్షణ 

125 ఏళ్లుగా కార్యక్రమాల నిర్వహణ 

రామకృష్ణ మిషన్‌ ఆశ్రమం కార్యదర్శి బోధమయానంద స్వామీజీ


‘దేశ ప్రజలను జాగృతం చేసి, వారిలో మరుగున పడిపోయిన సంఘ శక్తి, క్రమశిక్షణ. దేశ భక్తిని మేల్కొలపడమే లక్ష్యంగా వివేకానందుడు ప్రసంగాలు సాగాయని, అందుకు అనుగుణంగా ఆయన రచించిన ప్రణాళికలో భాగంగా రామకృష్ణ మిషన్‌ ఆవిర్భవించిందని నగరంలోని రామకృష్ణ మిషన్‌ ఆశ్రమం కార్యదర్శి బోదమయానంద స్వామీజీ వివరించారు. హైదరాబాద్‌ నుంచి ఇక్కడి ఆశ్రమానికి వచ్చిన ఆయన ఆశ్రమం ఏర్పాటు చేసి 125 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా  ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణ మిషన్‌ ఆశ్రమం నిర్వహిస్తున్న కార్యక్రమాలు, తదితర అంశాలు ఆయన మాటల్లోనే....

స్వామి వివేకానందుడు ఉదాత్త ఆశయంతో రామ కృష్ణ మిషన్‌ను ఏర్పాటుచేశారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చి ఇక్కడి పరిస్థితులు, ప్రజల వ్యవ హారశైలిని గమనించి దేశంకోసం ఏదో ఒకటి చేయాలని భావించారు. పాశ్చాత్య దేశాల ప్రజల్లో ఉన్న సంఘశక్తి, క్రమశిక్షణ, దేశభక్తి.. ఇక్కడి ప్రజల్లో లేకపోవడాన్ని గుర్తించారు. ఆక్రమణలు, దుష్ప్రచారాల ఫలితంగా వీటిని విస్మరించడాన్ని గుర్తించి.. మేల్కొలిపేందుకు ఒక సంఘం అవసరమని భావించి 1897లో రామకృష్ణ మిషన్‌ను ఏర్పాటుచేశారు. అంతకుముందు నాలుగేళ్ల పాటు దేశవ్యాప్తంగా పర్యటించిన ఆయన.. ప్రజల్లో అం తర్లీనమైన దేశభక్తిని, శక్తి, సామర్థ్యాలను గుర్తించారు. 


హైదరాబాద్‌లో మొదటి ఉపన్యాసం.. 


అమెరికాలోని చికాగోలో వివేకానందుడు ఇచ్చిన ప్రసంగమే మొదటిదిగా చాలామంది భావిస్తుంటారు. అయితే అంతకుముందు 1893 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో స్వామి మొదటి ఉపన్యాసం ఇచ్చారు. నిజాం నవాబును కలిసిన తరువాత మై మిషన్‌ టూ వెస్ట్‌  అంశంపై మహబూబ్‌ కాలేజీలో ఇచ్చిన ప్రసంగం ఎందరినో జాగృతం చేసింది. అమెరికా నుంచి  వచ్చిన తరువాత మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన కొంత మంది విద్యార్థులు స్వామిని కలిశారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించడంపై ఆయన వద్ద ప్రస్తావిం చగా.. ముందు మనమంతా మనుషులుగా మారాలని,  వచ్చే 50 ఏళ్లలో దేశానికి స్వాతంత్య్రం వస్తుందని,  భయంకరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆనాడే విద్యార్థి సంఘ నాయకులకు చెప్పారు.  


దేశం కోసం ఏం చేయాలో.. 


 1897 జనవరి 15 నుంచి ఏప్రిల్‌ 15 వరకు కొలం బో టూ ఆల్మోరాలో భాగంగా ఆయన ఇచ్చిన 25 ఉప న్యాసాలు సందేశ తరంగణిలో నిక్షిప్తం చేశారు. 1897 మే ఒకటో తేదీన కోల్‌కత్తాలోని బలరాం సమావేశ మందిరంలో రామకృష్ణ మిషన్‌ అసోసియేషన్‌ పేరుతో  కమిటీని ఏర్పాటు చేసి,  రెండుగా  విభజించారు. మొదటిది రామకృష్ణ మఠం. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమా లు, పుస్తకాలు, భక్తులు, శిక్షణ కోసం నిర్దేశించినది. రెం డోది రామకృష్ణ మిషన్‌. దీని ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తారు. ప్రధానంగా స్కూల్స్‌, కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ చేపట్టాలని స్వామి మార్గదర్శనం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 275 రామకృష్ణ మిషన్‌ ఆశ్రమాలున్నాయి. వీటిలో రెండు వేల మంది సన్యాసులున్నారు. వేయి మంది చురుగ్గా పనిచేస్తున్నారు. తొమ్మిదేళ్లపాటు బ్రహ్మ చర్యంతో కూడిన కఠోర శిక్షణ ఉంటుంది. అనంతరం సన్యాసులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. గతంలో సన్యాసులు అంటే అడవుల్లో, మఠాల్లో ఉండేవారు. వివేకానందుడు ఆ భావాన్ని మార్చారు. సమాజం, నగరాల మధ్యలో ఉండి సమాజ సేవ చేయాలని కొత్త సన్యాస సేవా ధర్మాన్ని  చూపించారు. 


ఎనిమిది అంశాలు కీలకం.. 


నేటి యువత దురలవాట్లతో చిత్తవుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ తర హా సమస్యలకు చెక్‌ చెప్పేందుకు ఎనిమిది అంశాలపై యువత దృష్టి సారించాలి. ఆత్మ విశ్వాసం, ఆత్మస్థైర్యం, ఇంద్రియ నిగ్రహం, ఆత్మజ్ఞానం, ఆత్మ విలువ, నాయ కత్వ లక్షణం, ఆత్మత్యాగం, దృఢ సంకల్పం, వీటిపై పట్టు సాధిస్తే చాలు. బలమైన యువ నిర్మాణం సాధ్యమని స్వామి  విశ్వసించారు. 


కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక.. 


విశాఖ రామకృష్ణ మిషన్‌ ఆధ్వర్యంలో అనేక కార్యర కమాలు నిర్వహిస్తున్నాం. బాల వికాస్‌ సమ్మర్‌ క్యాంప్‌ ను మే రెండు నుంచి 16 వరకు నిర్వహిస్తున్నాం. యువతకు మే ఒకటి  నుంచి మూడు నుంచి నాలుగు నెలలపాటు స్వయం సేవపై శిక్షణ ఇవ్వనున్నాం. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు, సీఏ నిపుణులతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సలహాలు, సూచనలు అందిం చే ‘నా భారతం.. అమర భారతం’ పేరుతో ట్రైనింగ్‌ 


ప్రొగ్రామ్‌ ప్రారంభించనున్నాం. దూరశిక్షణ పేరుతో.. ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తున్నాం.  సెరిబ్రల్‌ పాలసీతో బాధపడుతున్న చిన్నారులు కోసం ఉచితంగా క్లినిక్‌ నిర్వహిస్తున్నాం.  ఏజెన్సీ ప్రాంతాల్లో సేవా కార్యక్రమా లను నిర్వహిస్తున్నాం. మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. రామకృష్ణ  లైబ్రరీని స్టడీ సెంటర్‌గా ఎంతో మంది వినియోగించుకుంటున్నారు.  


వివేకానంద యువ సంఘర్ష్‌.. 


వివేకానంద యువ సంఘర్ష్‌ పేరుతో యువతకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. లీడర్‌ షిప్‌ కాంటెస్ట్‌, స్పీచ్‌ కాంటెస్ట్‌, ఎస్సే రైటింగ్‌ పోటీలను నిర్వహించి యువతలోని సామర్థ్యా లను వెలికితీస్తాం. 

Updated Date - 2022-04-21T21:43:30+05:30 IST