విశాఖ ఉక్కు పరిరక్షణకు 5న రాష్ట్ర బంద్‌

ABN , First Publish Date - 2021-03-02T05:52:48+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి 1: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కేంద్ర కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 5న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. సుందరయ్యభవన్‌లో సోమవారం వి లే

విశాఖ ఉక్కు పరిరక్షణకు 5న రాష్ట్ర బంద్‌

విజయవంతం చేయాలి : వామపక్షాలు

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మార్చి 1: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కేంద్ర కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 5న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. సుందరయ్యభవన్‌లో సోమవారం వి లేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, సీపీఐ ఎంఎల్‌ డెమోక్రసీ జిల్లా నాయకుడు జె.వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు జి.ఆదినారాయణ, సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ నా యకుడు ఎం.లక్‌బాబు మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని, కన్నతల్లి లాంటి విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ప్రధాని మోదీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు. 5న రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయన్నారు. జిల్లాలోని వర్తక, వాణిజ్య, విద్యాసంస్థలు, థియేటర్స్‌, పరిశ్రమలు, రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు బంద్‌కు సహకరించాలని వారు కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దువ్వా శేషబాబ్జి, వామపక్ష నాయకులు రాజశేఖర్‌, తోకల ప్రసాద్‌, నక్క కిశోర్‌, చింతపల్లి అజయ్‌కుమార్‌, చిట్టిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T05:52:48+05:30 IST