పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నేడు

ABN , First Publish Date - 2021-10-19T14:30:19+05:30 IST

పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో కీలక ఘట్టం సిరిమానోత్సవం మంగళవారం జరగనుంది.

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నేడు

విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో కీలక ఘట్టం సిరిమానోత్సవం మంగళవారం జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తుల నడుమ సిరిమానోత్సవం జరగనుంది. పోలీసులు మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేశారు. సిరిమాను వీక్షణకు ఎత్తుబ్రిడ్జి, కోట, మూడులాంతర్లు, కొత్తపేట జంక్షన్‌తో పాటు నగరంలోని పలు కూడళ్లలో స్కీన్లను ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను తిరిగేందుకు వీలుగా ముహూర్తాన్ని నిర్ణయించారు. సాయంత్రం 5 గంటలకు ఉత్సవం ముగిసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కరోనా నిబంధనల వలన రధోత్సవంలో భక్తులకు అనుమతి నిరాకరించారు. 


రథాలు ఊరేగింపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించటానికి అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు అమ్మవారి దర్శనాలకు అనుమతించారు. మంత్రి బొత్స సత్యన్నారాయణ, ఎమ్మెల్యే వీరభధ్రస్వామి ఉత్సవ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కరోనా నిబంధనలు ఎవరైనా పాటించాల్సిందేనని దేవస్ధాన అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-19T14:30:19+05:30 IST