విజ్ఞాన ఫలాలు సమాజపరం కావాలి

ABN , First Publish Date - 2022-09-23T05:34:58+05:30 IST

యువ సాంకేతికనిపుణులు తమ విజ్ఞాన ఫలాలను సమాజానికందించి దాని పురోభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ఉద్ఘాటిం చారు.

విజ్ఞాన ఫలాలు సమాజపరం కావాలి
స్నాతకోత్సవంలో నితిన్‌గడ్కరీని సత్కరిస్తున్న విజ్ఞాన్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ లావు రత్తయ్య, శ్రీకృష్ణదేవరాయులు

విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య

అంబరాన్నంటిన విజ్ఞాన్‌వర్సిటీ 10వ స్నాతకోత్సవం

స్ఫూర్తిదాయకంగా ప్రముఖుల సందేశాలు

గుంటూరు(విద్య), సెప్టెంబరు 22: యువ సాంకేతికనిపుణులు తమ విజ్ఞాన ఫలాలను సమాజానికందించి దాని పురోభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ఉద్ఘాటిం చారు. గురువారం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో నిర్వ హించిన 10వ స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వర్సిటీలో విద్యను అభ్యసించిన 90 శాతం మంది ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు సాధించా రన్నారు. యువత జీవితంలో స్థిరపడడంతోపాటు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని సమర్ధవంతంగా ఎదుర్కొవాలన్నారు. భవిష్యత్‌ అవసరాలను సాంకేతికతను మిళితం చేసి ఎంచుకున్న రంగంలో రాణించాలని కోరారు. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌  చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ పరిశోధనల ద్వారానే నూతన ఆవిష్కరణలకు అస్కారం ఉంటుందన్నారు. సమస్యల్ని పరిష్కరించే దశలో ఎంతో ఓర్పు, నేర్పు, నాయకత్వ లక్షణాలు ఉండాలన్నారు. ఎంటర్‌పెన్యూర్‌ అంటే డబ్బులు సంపాదంచడం మాత్రమే కాదని సమాజంలో సమస్యలు పరిష్కరించడం కూడా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రముఖ బ్యాట్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ ప్రసంగిస్తూ శారీరక శ్రమ కలిగేలా క్రీడలతో శారీరక శ్రమ మాత్రకు కాదు మానసిక దృఢత్వం అలవడుతుందన్నారు. యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఆస్ర్టామేక్రోవేవ్‌ ఉత్పత్తుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అందుకు యువత తగిన బాధ్యత తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ అభ్యున్నతి కోసం మాత్రమే కాకుండా దేశాభివృద్ధికి ఉపయోగ పడేలా చూడాలన్నారు. విజ్ఞాన్‌ విద్యాసంస్థ వైస్‌చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లా డుతూ ప్రతి విద్యార్థి రానున్న తరాలకు ప్రతినిధిగా ఉండాలన్నారు. పోటీతత్వాన్ని, సమాజ పరిస్థితితుల్ని తట్టుకుని ఎదగాలన్నారు. క్షణికమైన సంతోషాల జోలికి వెళ్ళకుండా ధృడ సంకల్పంతో ఉన్నత స్థాయికి చేరాలన్నారు.

అంబరాన్ని అంటిన సంబరాలు ..

స్నాతకోత్సవంలో యువత సంబరం అంబరాన్నంటింది, యవత ప్రముఖుల నుంచి  డిగ్రీలు అందుకుని కొత్త ఉత్సాహంతో ప్రాంగణమంతా తిరుగుతూ హోరెత్తించారు. తమ నాలుగేళ్ల అనుభవాలను స్నేహితులు, సన్నిహితులతో పంచుకుంటూ ఉత్సాహంగా గడిపారు. యువతీ,యుకులు ఒకరికొకరు సెల్‌ఫోన్లతో సెల్ఫీలు తీసుకుంటూ తమ జ్ఞాపకాల్ని పదిలం చేసుకున్నారు. సంప్రదాయ బద్దంగా తెలుగుతనం ఉటి ్టపడేలా తలపాగా, కండువాలు, జుబ్బాలు, పంచెలు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ పీ నాగభూషణ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, స్నాతకోత్సవ కన్వీనర్‌ డాక్టర్‌ డి విజయకృష్ణ, వివిధ విభాగాల డీన్లు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-23T05:34:58+05:30 IST