Shashikala: సమయం వచ్చినప్పుడు పార్టీ కార్యాలయానికి...

ABN , First Publish Date - 2022-09-16T13:28:56+05:30 IST

సమయం వచ్చినప్పుడు అన్నాడీఎంకే కార్యాలయానికి వెళతానని వీకే శశికళ(VK Sasikala) నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దివంగత మాజీ

Shashikala: సమయం వచ్చినప్పుడు పార్టీ కార్యాలయానికి...

                                                  - వీకే శశికళ


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 15: సమయం వచ్చినప్పుడు అన్నాడీఎంకే కార్యాలయానికి వెళతానని వీకే శశికళ(VK Sasikala) నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 114వ జయంతి సందర్భంగా తంజావూరులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన శశికళ మీడియాతో మాట్లాడుతూ.. అన్నా చూపిన మార్గంలో తాము పయనిస్తున్నామన్నారు. సమయం వచ్చినప్పుడు పార్టీ కార్యాలయానికి వెళ్తానన్నారు. అన్నాడీఎంకే(AIADMK) నేతలు ఐక్యంగా ఉంటేనే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందన్నారు. అన్నాడీఎంకే అమలుచేసి ప్రజాదరణ పథకాలను నిలిపివేయడం డీఎంకే ప్రభుత్వానికి మంచిది కాదని శశికళ పేర్కొన్నారు.

Updated Date - 2022-09-16T13:28:56+05:30 IST