1న జిల్లా వాలీబాల్‌ జూనియర్‌ జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-11-29T05:56:11+05:30 IST

1న జిల్లా వాలీబాల్‌ జూనియర్‌ జట్ల ఎంపిక

1న జిల్లా వాలీబాల్‌ జూనియర్‌ జట్ల ఎంపిక

భవానీపురం, నవంబరు 28 : కృష్ణాజిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో డిసెంబరు ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌  స్టేడియంలో జూనియర్‌ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక జరుగుతుందని అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి డి.దయాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన జట్లను అనంతపురంలో డిసెంబరు 10 నుంచి 12వ తేదీ వరకూ జరిగే అంతర్‌ జిల్లాల చాంపియన్‌షిప్‌కు పంపుతామని, ఆసక్తి కలిగిన క్రీడాకారులు 2003, జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారై ఉండాలని సూచించారు. 

Updated Date - 2021-11-29T05:56:11+05:30 IST