పీఈఎస్‌లో ముగిసిన వాలీబాల్‌ ప్రీమియర్‌ లీగ్‌

ABN , First Publish Date - 2022-08-13T05:34:41+05:30 IST

పీఈఎస్‌ వైద్య కళాశాలలో పదిరోజులపాటు జరిగిన వాలీబాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ శుక్రవారంనాటితో ముగిసింది. విజయ్‌ వైకింగ్‌, ఆదిత్య ఆర్మర్‌ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పైనల్‌ మ్యాచ్‌లో విజయ్‌ వైకింగ్‌ ట్రోఫీని కైవశం చేసుకుంది.

పీఈఎస్‌లో ముగిసిన వాలీబాల్‌ ప్రీమియర్‌ లీగ్‌
విజేత జట్టుకు ట్రోఫీ ప్రదానం చేస్తున్న డాక్టర్‌ హెచ్‌ఆర్‌.కృష్ణారావు

కుప్పం, ఆగస్టు 12: పీఈఎస్‌ వైద్య కళాశాలలో పదిరోజులపాటు జరిగిన వాలీబాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ శుక్రవారంనాటితో ముగిసింది. విజయ్‌ వైకింగ్‌, ఆదిత్య ఆర్మర్‌ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన పైనల్‌ మ్యాచ్‌లో విజయ్‌ వైకింగ్‌ ట్రోఫీని కైవశం చేసుకుంది. విజేతలకు కళాశాల డీన్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హెచ్‌ఆర్‌.కృష్ణారావు ట్రోఫీ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 8 జట్లు ఈ పోటీలలో పాల్గొన్నట్లు చెప్పారు. మెడికల్‌, నాన్‌ మెడికల్‌ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సభ్యులుగా ఉన్నారన్నారు. ఇటువంటి క్రీడలు తరచూ నిర్వహించడంవల్ల అందరి మధ్యా స్నేహ సుహృద్భావాలు పెంపొంది సంఘీభావం చోటు చేసుకుంటుందని చెప్పారు. పీఈఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనస్టిట్యూషన్ల 50 సంవత్సరాల వేడుకలో భాగంగా ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని కోర్సుల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-08-13T05:34:41+05:30 IST