ముగిసిన వాలీబాల్‌ పోటీలు

Published: Mon, 17 Jan 2022 22:37:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ముగిసిన వాలీబాల్‌ పోటీలువిజేత జట్ల సభ్యులతో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

వెంకటగిరి, జనవరి 17: వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్‌ కళాశాల క్రీడా ప్రాంగణంలో జీఎన్‌ఆర్‌ సర్వీస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 16న ప్రారంభమైన కోదండరామయ్య మెమోరియల్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ సోమవారం ముగిసింది.  నాయుడు పేటకు చెందిన ఎస్వీ టైగర్స్‌ జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రూ.25 వేలు , రెండవ స్థానంలో నిలిచిన నెల్లూరు అసోసియేషన్‌ - 2 జట్టు రూ 15వేలు, మూడవ స్థానంలో నిలిచిన నెల్లూరు అసోసియేషన్‌ - 1 జట్లు రూ. 10వేలు, నాలుగో స్థానంలో నిలిచిన వడమాలపేట శ్రీను జట్టు రూ.10 వేలు నగదు బహుమతులను అందుకున్నాయి.  మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నగదు బహుమతులను అంద చేశారు. యువక్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ట్రస్టు అధినేత గంగోటి నాగేశ్వరావును ఈ సందర్భంగా ఆయన అభినందించారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన పలువురు క్రీడా కారులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు వల్లభనేని మధునాయుడు, డాక్టర్‌ రవీంద్రనాథ్‌, బీకే ప్రసాద్‌, చెంగల్‌రాయుడు తదితరులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.