
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సైనిక మద్దతును అందించాలని నాటోను కోరారు. ఉక్రెయిన్లో రష్యా ఫాస్పరస్ బాంబులను ఉపయోగిస్తోందని జెలెన్స్కీ గురువారం ఆరోపించారు. సైనిక మద్దతును అందించాలని నాటోను కోరినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ ఉదయం పనిలోపనిగా రష్యా ఫాస్ఫరస్ బాంబులు ఉపయోగించిందని, ఈ ఘటనలో పెద్దలతోపాటు చిన్నారులు చాలా మంది చనిపోయారని జెలెన్స్కీ యూఎస్ నేతృత్వంలోని సైనిక కూటమికి వీడియో ప్రసంగం ద్వారా చెప్పారు.
ఇవి కూడా చదవండి