స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-11T04:16:09+05:30 IST

రోజు రోజుకి కరోనా మ హమ్మారి విజృంభిస్తుండడంతో జిల్లా కేంద్రంలో వివిధ వ్యా పార, వాణిజ్య సంస్థలు, సంఘాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ దిశ గా అడుగులు వేస్తున్నాయి.

స్వచ్ఛంద లాక్‌డౌన్‌
జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ తీర్మాన పత్రాన్ని ప్రదర్శిస్తున్న దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు

- ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే వ్యాపార లావాదేవీలు


నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 10: రోజు రోజుకి కరోనా మ హమ్మారి విజృంభిస్తుండడంతో జిల్లా కేంద్రంలో వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, సంఘాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. వారంక్రితం పట్టణ కిరాణం, వర్తక సంఘం మధ్యాహ్నానికే షాపులు మూసి వేయాలని తీర్మానం చేసి అమలు చేస్తుండగా సోమవారం మరికొన్ని వ్యా పార వర్గాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. మంగళవారం నుంచి ఈ నెల 20 వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే తెరిచి ఉంచాలని పట్టణ ద్విచ క్ర వాహన డీలర్ల సంఘం తీర్మానం చేసుకున్నాయని సం ఘం అధ్యక్షుడు ఎండీ జహీర్‌ తెలిపారు. అలాగే సోమవా రం నుంచి ఈ నెల 16 వరకు వారం రోజుల పాటు తమ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిపి వేస్తున్నట్లు పట్టణ దస్తావేజుల లేఖరుల సంఘం అధ్యక్షుడు పార్థసారథి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కరోనా కట్టడికి సామాజిక బాధ్యతగా తమవంతు కృషి చేసేందుకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అందుకు ప్రజలందరు సహకరించాలని కోరారు. 

 

చారకొండలో..

చారకొండ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతిని తగ్గించేందుకు మండల కేంద్రంలో చేపట్టిన స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. సోమవారం మండ ల కేంద్రంలో, వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు స్వచ్ఛందంగా ముసివే శారు. గ్రామ పాలక మండలి ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే తెరిచి ఉంచారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ గుండె విజేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి రోజురోజుకు విజృం భిస్తున్న కారణంగా ప్రతీ ఒక్కరు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరా రు. మాస్కులు ధరించి భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచించా రు. అదేవిధంగా మండల పరిధిలోని జూపల్లి గ్రామంలో స్వచ్ఛందంగా లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాలని గ్రామస్థులతో కలిసి సర్పంచ్‌ పాలాద్రి మల్లీ శ్వరి తీర్మానం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ రూప ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించగా మండల వ్యాప్తంగా 10 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. పంచాయతీ కార్యదర్శి రమేష్‌, ఏఎస్‌ఐ చెన్నకిష్టారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 

నేటి నుంచి ఉప్పునుంతలలో..

ఉప్పునుంతల: ఉప్పునుంతలలో మంగళవారం నుంచి స్వచ్ఛందంగా లాక్‌ డౌన్‌ నిర్వహించనున్నట్లు సర్పంచ్‌ సరిత తెలిపారు. సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో  సర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ఈ మేరకు తీర్మానించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మండల కేం ద్రంలో ఉదయం 6గంటల నుంచి 11గంటల వరకు మాత్రమే క్రయవిక్రయా లు చేసుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించాలని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి మహబూబ్‌ అలీ, ఎస్సై రమేష్‌, గ్రామపెద్దలు, నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-11T04:16:09+05:30 IST