కరోనా వైరస్‌ కట్టడికి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-07T06:18:28+05:30 IST

సుల్తానాబాద్‌లో వ్యాపార వాణి జ్య సంస్థలు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించుకున్నాయి.

కరోనా వైరస్‌ కట్టడికి స్వచ్ఛంద లాక్‌డౌన్‌
సుల్తానాబాద్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌తో బోసిపోతున్న మార్కెట్‌ రోడ్డు

సుల్తానాబాద్‌, మే6: సుల్తానాబాద్‌లో వ్యాపార వాణి జ్య సంస్థలు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించుకున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌లో కేసులు బాగా పెరిగిపోతుండడంతో మహమ్మారిని కట్టడి చేయడం కోసం స్థానిక మున్సిపల్‌ పాలకవర్గం, వ్యాపారసంస్థలు ఉమ్మడి చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం సుల్తానాబాద్‌ పట్టణంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి అన్ని షాపు లు మూతపడ్డాయి. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే వ్యాపా రాలు నిర్వహించుకోవాలని దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. పట్టణప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వ్యాపార వాణిజ్య సంస్థల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు లింగమూర్తి, పల్లా శ్రీనివాస్‌ తదితరులు వివరించారు. ప్రతీ ఒక్కరూ నియమాలను పాటించి సహకరించాలని వారు కోరారు. మధ్యాహ్నం నుంచి అన్ని దుకాణాలు బంద్‌ చేయడంతో రోడ్లన్నీ జన సంచారం లేక బోసిపోయాయి. రాజీవ్‌ రహదారికి ఇరువైపులా ఉన్న వ్యాపార వాణిజ్య సంస్థలతోపాటు నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌ రోడ్డు, పోస్టాఫీసు రోడ్డు, ఐబీ చౌరస్తా, శ్రీరాంపూర్‌ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. 

Updated Date - 2021-05-07T06:18:28+05:30 IST