19 నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-04-17T06:04:57+05:30 IST

కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటి వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు ముందుకు వస్తున్నట్లు పట్టణ హోల్‌సేల్‌, రిటైల్‌ కిరాణా వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జె.రామకృష్ణ, కె. వాసుదేవరావు తెలిపారు.

19 నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

పార్వతీపురంటౌన్‌, ఏప్రిల్‌ 16: కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటి వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు ముందుకు వస్తున్నట్లు పట్టణ హోల్‌సేల్‌, రిటైల్‌ కిరాణా వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జె.రామకృష్ణ, కె. వాసుదేవరావు తెలిపారు. శుక్రవారం సంఘ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ కరోనా ఇంకా ప్రబలకుండా తమ వంతుగా సంఘం తరఫున స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు మద్దతు ఇస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచుతామన్నారు. షాపులకు వచ్చే కొనుగోలుదారులంతా మాస్కులు ధరించి వస్తేనే నిత్యావసర సరుకులు ఇస్తామని, కొనుగోలు దారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. లాక్‌డౌన్‌కు కళాసీ సంఘం తరఫున మద్దతు ఇస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు జి.సర్వేశ్వరరావు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-04-17T06:04:57+05:30 IST