కృష్ణాజిల్లా: కీచక వాలంటీర్

Jul 30 2021 @ 14:21PM

కృష్ణాజిల్లా: గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలు, సమస్యల పరిష్కారం కోసం నియామకమైన వాలంటీర్లలో కొందరు రెచ్చిపోతున్నారు. అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఓ మహిళతో వాలంటీర్  అసభ్యకరంగా ప్రవర్తించాడు. భర్తతో కలిసి ప్రశ్నించిన బాధితురాలిపైనే వాలంటీర్ దాడికి దిగిన ఘటన కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం, జానకిరామపురంలో జరిగింది.


వాలంటీర్ చంద్రశేఖర్ ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. సంక్షేమ పథకాల పేరుతో ఇంటింటికి తిరిగే వాలంటీర్ ఒంటరిగా ఉన్న మహిళపై అఘాయిత్యం చేయబోయాడు. ఇంటికి వచ్చిన భర్తకు బాధితురాలు జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత భర్తతో కలిసి వాలంటీర్ చంద్రశేఖర్‌ను నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన వాలంటీర్ బాధితురాలిపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.