పింఛన్‌ పంపిణీలో వసూళ్లు

ABN , First Publish Date - 2021-03-02T06:04:18+05:30 IST

మహానంది గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరు వలంటీర్లు పింఛన్‌ పంపిణీలో కొంతమంది లభ్దిదారుల నుంచి రూ. 150 వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

పింఛన్‌ పంపిణీలో వసూళ్లు


  1.  ఎంపీడీవో ఆగ్రహం.. తిరిగి చెల్లింపు

మహానంది, మార్చి 1: మహానంది గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరు వలంటీర్లు పింఛన్‌ పంపిణీలో కొంతమంది లభ్దిదారుల నుంచి రూ. 150 వసూలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. సోమవారం మహానందిలో పింఛన్‌ పంపిణీ సమయంలో మిషన్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. మరమ్మతులకు రూ.150 ఇవ్వాలని లబ్ధిదారులకు చెప్పారు. దీంతో కొంతమంది నగదును వలంటీర్లకు ఇచ్చారు. చివరికి వలంటీర్లు వసూలు చేసిన సొమ్ముపై కొంతమంది పింఛన్‌దారులు ఎంపీడీవో సుబ్బరాజుకు పిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవో విచారణ చేశారు. వసూళ్లు చేసిన వలంటీర్లను ఎంపీడీవో మందలించారు. భవిష్యత్తుల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే విధుల నుంచి తప్పిస్తానని హెచ్చరించారు. వసూలు చేసిన డబ్బులను తిరిగి వలంటీర్ల ద్వారా పింఛన్‌దారులకు ఇప్పించారు.

Updated Date - 2021-03-02T06:04:18+05:30 IST