అసలీ వలంటీర్లు ఎవరు?

ABN , First Publish Date - 2022-05-07T07:54:09+05:30 IST

వలంటీర్‌ వ్యవస్థపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను నిర్ణయించేందుకు వారికున్న అధికారం ఏమిటని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

అసలీ వలంటీర్లు ఎవరు?

లబ్ధిదారుల్ని ఎలా నిర్ణయిస్తారు? 

ఈ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? 

వారు ప్రభుత్వ ఉద్యోగులేనా?

తీవ్రంగా స్పందించిన హైకోర్టు

ప్రతివాదులకు నోటీ సులు జారీ

అమరావతి, మే6 (ఆంధ్రజ్యోతి): వలంటీర్‌ వ్యవస్థపై హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను నిర్ణయించేందుకు వారికున్న అధికారం ఏమిటని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వలంటీర్‌ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? వారు అసలు ప్రభుత్వ ఉద్యోగులేనా? సర్వీసు రూల్స్‌ ఉన్నాయా.? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. లబ్ధిదారుల ఎంపికలో వలంటీర్ల జోక్యం ఏమిటని నిలదీసింది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్‌,  ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడు.. ప్రభుత్వ ఉద్యోగులే కాని వలంటీర్లతో లబ్ధిదారులను ఎందుకు ఎంపిక చేయిస్తున్నారని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సంబంధిత వలంటీర్లు, అధికారులకు నోటీసులు జారీచేసింది. విచారణ వేసవి సెలవుల తరువాతకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టుదేవానంద్‌ శుక్రవారం ఆదేశాలిచ్చారు. వైఎ్‌సఆర్‌ చేయూత పథకం కింద గతంలో లబ్ధి పొందిన తమను రాజకీయ కారణాలతో లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారని పేర్కొంటూ గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామానికి చెందిన ఆర్‌.వసంతలక్ష్మి, మరో 26మంది హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది అరుణ్‌శౌరి వాదనలు వినిపించారు.  

Read more