ఒమైక్రాన్‌ ఎఫెక్ట్‌.. పాఠశాలలకు అదనపు నిబంధనలు

ABN , First Publish Date - 2021-12-04T17:13:03+05:30 IST

ఒమైక్రాన్‌ వ్యాప్తి అడ్డుకొనేలా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అదనపు నిబంధనలు విధిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. సౌత్‌ ఆఫ్రికాలో తొలిసారిగా గుర్తించిన ఒమైక్రాన్‌ వైరస్‌ పలు దేశాలకు వ్యాపించింది. దేశంలో ఈ

ఒమైక్రాన్‌ ఎఫెక్ట్‌.. పాఠశాలలకు అదనపు నిబంధనలు

చెన్నై: ఒమైక్రాన్‌ వ్యాప్తి అడ్డుకొనేలా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అదనపు నిబంధనలు విధిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. సౌత్‌ ఆఫ్రికాలో తొలిసారిగా గుర్తించిన ఒమైక్రాన్‌ వైరస్‌ పలు దేశాలకు వ్యాపించింది. దేశంలో ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేలా అన్ని రాష్ట్రప్రభు త్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వం సూచించింది. ఆ ప్రకారం, పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు జారీచేసిన ఉత్తర్వుల్లో, 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు షిఫ్టుల విధానంలో తరగతులు నిర్వహించాలి. అదే సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా కూడా తరగతులు బోధించవచ్చు. అసెంబ్లీ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు విరమించుకోవాలి. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలు అనుమతించరాదని, ఈ నిబంధనలు పాఠశాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2021-12-04T17:13:03+05:30 IST