ఓటరు జాబితా సవరణ చేపట్టాలి

ABN , First Publish Date - 2021-06-20T04:45:04+05:30 IST

నూతన ఓటరు నమోదు, జాబితాల సవరణ మార్పులు చే ర్పులు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికా రి శశాంక్‌గోయల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఓటరు జాబితా సవరణ చేపట్టాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ శర్మన్‌, ఇతర అధికారులు

-  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌గోయల్‌

- 18 ఏళ్లు నిండిన అందరికీ ఓటు హక్కు కల్పిస్తాం :  కలెక్టర్‌  శర్మన్‌


నాగర్‌కర్నూల్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): నూతన ఓటరు నమోదు, జాబితాల సవరణ మార్పులు చే ర్పులు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికా రి శశాంక్‌గోయల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.  ఆయన శనివారం జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఈవీఎం గోదాములను 15 రోజుల్లో పూర్తి చేయాలని, ఈవీఎంలను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈవీఎంల నిర్వహణ కోసం జిల్లా స్థాయి ఈవీఎం నోడల్‌ అధికారులను వెంటనే నియమించాలన్నారు. ఈవీఎంల మెయింటెనెన్స్‌, భద్రతా పరమైన అంశాలను పూర్తి పర్యవేక్షణ బాధ్య తలను నోడల్‌ అధికారికి అప్పగించాలన్నారు. నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు  ఓటర్ల జాబితాలో నమోదు చేసేందుకు ఫారం 6, 7, 8ఏ జా బితాలో మార్పులు చేర్పులను వెంటనే చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు మాస్ట ర్‌ టైనర్లను నియమించు కోవాలని సూచించారు.  జిల్లాలో  ఈవీఎంల గోదాం వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేప డుతామని కలెక్టర్‌ శర్మన్‌ వివరించారు. ఈ సమావేశంలో కొల్లాపూర్‌ ఆర్డీవో పాండు నాయక్‌, కలెక్టరేట్‌ ఏవో కార్తీక్‌, ఎన్నికల నిర్వహణ సిబ్బంది అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-20T04:45:04+05:30 IST