గరుడ యాప్‌పై ఓటర్లకు అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-08-11T05:22:50+05:30 IST

జిల్లాలోని ఓటర్లందరికీ ఓటరు ఐడీకి ఆధార్‌ను లింక్‌ చేసుకునే విధంగా రూపొందించిన గరుడ యాప్‌పై అవగాహన కల్పించాల ని కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు.

గరుడ యాప్‌పై ఓటర్లకు అవగాహన కల్పించాలి
సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

= కలెక్టర్‌ శ్రీహర్ష

గద్వాల టౌన్‌, ఆగస్టు 10 : జిల్లాలోని ఓటర్లందరికీ ఓటరు ఐడీకి ఆధార్‌ను లింక్‌ చేసుకునే విధంగా రూపొందించిన గరుడ యాప్‌పై అవగాహన కల్పించాల ని కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు.   బుధవారం పట్టణంలోని బాలభవన్‌లో ఓటరు నమోదు బూత్‌లెవెల్‌ అధికారులు, సూపర్‌వైజర్ల కోసం అవగాహన సదస్సు ని ర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సూపర్‌వైజర్లు, బూత్‌లెవెల్‌ అధికారులు ఇంటింటికి తిరిగి 18సంవత్సరాలు నిండిన ప్రతీఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఓటరు నమోదు అనంతరం గరుడ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ పేర్లను అప్‌లోడ్‌ చేసుకునేలా వారికి అవ గాహన కల్పించాలన్నారు.  ప్రతిరోజు పదిమంది ఓటర్లు గరుడయాప్‌లో నమోదు చేసుకునేలా చూడాలని, ఓటరు నమోదు ప్రక్రియను 2023 మార్చిలోగా పూర్తి చే యాలని ఆదేశించారు. గద్వాల నియోజకవర్గం-79, అలంపూర్‌ నియోజకవర్గం-80 ఫారం-6బి, ఫారం-8లో మార్పులు, చేర్పులు జరిగాయని, ఆన్‌లైన్‌లో పేరునమోదు చేయగానే వారి ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుందని తెలిపారు.  కాగా ఎవరైనా ఓటరు మరణిస్తే వారి మరణ ధ్రువీకరణ పత్రాన్ని మరియు వికలాంగులైన ఓటర్ల వికలత్వ శాతం ఎంత ఉందో తెలుసుకుని అప్‌లోడ్‌ చేయాలన్నారు.  సమావేశంలో గద్వాల ఆర్డీవో రాములు, ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా ఈడీ రమేష్‌బాబు, స్రీ,శిశు సంక్షేమశాఖ అధికారి ముషాయిదా బేగం, కలెక్టరేట్‌ సూపరిన్‌టెండెంట్‌ మదన్‌మోహన్‌, తహసీల్దార్‌లు వీరభద్రప్ప, సుబ్రమణ్యం ఉన్నారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు 

గద్వాల క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాల నుంచి 10వ తరగతిలో 2021-22 ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బుధవారం  కలెక్టర్‌ శ్రీహర్ష అభినందించారు. అలంపూర్‌లోని ప్రభుత్వ ఎస్‌సీ బాలికల వసతిగృహానికి చెందిన విద్యార్థి మేరీ 9.7 జీపీఏ, గద్వాలలోని ప్రభుత్వ బాలుర వసతిగృహం(బి)కు చెందిన మల్లికార్జున్‌ 9.8 జీపీఏ సాధించడంతో కలెక్టర్‌  సన్మానించి ఫాస్ట్‌ట్రాక్‌ వాచ్‌లను బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్‌  కులాల అభివృద్ధి అధికారి శ్వేత ప్రియదర్శిణి, ఏఎస్‌డబ్ల్యూవో సరోజ, వసతిగృహ వార్డెన్లు చంద్రన్‌, సుజాత ఉన్నారు.

కవి సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా ఆగస్టు 16న సాయంత్రం 3 గంటలకు జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో కవి సమ్మేళనం, ముషాయిరాలు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్రీహర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 75 వసంతాల స్వతంత్ర భారతం అనే అంశంపై కవులు కవితలు వినిపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-11T05:22:50+05:30 IST