కనీస వేతనం కోసం వీఆర్‌ఏల ఆందోళన

ABN , First Publish Date - 2021-07-27T06:34:25+05:30 IST

వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని సీఐటీయూ తూర్పు కృష్ణా ప్రధాన కార్యదర్శి వై.నరసింహారావు డిమాండ్‌ చేశారు.

కనీస వేతనం కోసం వీఆర్‌ఏల ఆందోళన

మచిలీపట్నం టౌన్‌, జూలై 26 : వీఆర్‌ఏలకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని సీఐటీయూ తూర్పు కృష్ణా ప్రధాన కార్యదర్శి వై.నరసింహారావు డిమాండ్‌ చేశారు. పే స్కేల్‌ అమలు చేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.  ధర్నాలో నరసింహారావు, వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షు డు బొడ్డు వెంకటరత్నం, సీఐటీయూ తూర్పు కృష్ణా అధ్యక్షుడు చౌటపల్లి రవి,  పశ్చిమకృష్ణా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పోలినాయుడు, మచిలీపట్నం నగర కార్యదర్శి బి. సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు.  జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలతకు సంఘ నాయకులు వినతిపత్రం సమర్పించారు. నామినీలుగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్‌ఏలుగా నియమించాలని,  వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించాలని కోరారు.
 ప్రభుత్వ పాఠశాలల ఆయాల ధర్నా
జీతాల బకాయిలు చెల్లించాలంటూ పాఠశాలల ఆయాలు కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద సోమవారం ఆయాలు ధర్నా చేశారు.  సీఐటీయూ ఆధ్వర్యంలో  200 మంది ప్రభుత్వ పాఠశాలల ఆయాలు ధర్నాలో పాల్గొన్నారు.  పారిశుధ్య కార్మికుల సంఘం కార్యదర్శి పి. శిరీష మాట్లాడుతూ, పాఠశాలలు పనిచేయకపోవడం వల్ల జీతాలు ఇవ్వమంటున్నారన్నారు.  నాడు - నేడు పనులకు ఉపాధ్యాయులు ఆయాల సేవలువినియోగించుకున్నారన్నారు.  జీతాలు ప్రతి నెలా చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయు గౌరవాధ్యక్షుడు డి. గంగాధర్‌, పారిశుధ్య కార్మికుల సంఘ అధ్యక్షురాలు ఎం.నాంచారమ్మ తదితరులు డిమాండ్‌ చేశారు.  కె. దుర్గా భవానీ, ఎన్‌. విజయలక్ష్మి, ఎం. మణికుమారి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-07-27T06:34:25+05:30 IST