సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏల నిరసన

ABN , First Publish Date - 2022-07-01T05:37:28+05:30 IST

ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు వీఆర్‌ఏల సమ స్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు గురువారం పాన్‌గల్‌, కొత్తకోట, ఆత్మకూర్‌ తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏల నిరసన
కొత్తకోటలో తహసీల్దార్‌ బాల్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న గ్రామ సేవకులు


పాన్‌గల్‌/కొత్తకోట/ఆత్మకూర్‌, జూన్‌ 30: ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు వీఆర్‌ఏల సమ స్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వీఆర్‌ఏలు గురువారం పాన్‌గల్‌, కొత్తకోట, ఆత్మకూర్‌ తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్లకు డిమాండ్లతో కూ డిన వినతిపత్రాలను అందించారు. పాన్‌గల్‌లో వీ ఆర్‌ఏ మండల అధ్యక్షుడు సురేష్‌ మాట్లాడుతూ వీఆర్‌ ఏల న్యాయమైన డిమాండ్లు, పేస్కేలు జీవోను వెంటనే విడుదల చేయాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగం ఇచ్చి, పెన్షన్‌ సౌకర్యం కల్పించా లని, అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి ఇచ్చిన హామీ మేరకు సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో వీఆర్‌ఏలు రాజు, రామకృష్ణ, అగరయ్య, అరుణ, వినోద తదితరులున్నారు. 

కొత్తకోట తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిర్వ హించిన నిరసనలో గ్రామ సేవకుల సంఘం మండల అధ్యక్షుడు వెంకట్రాములు, గౌరవ అధ్యక్షుడు బాలచం ద్రయ్య, ప్రవీణ్‌, బాలకృష్ణ, బాలరాజు, వెంకటయ్య, భా గ్యమ్మ, శాంతమ్మ, విజయకుమారి తదితరులున్నారు. 

ఆత్మకూర్‌లో గ్రామ సేవకుల సంఘం మండల అధ్యక్షుడు గోవిందు మాట్లాడారు. గ్రామ సేవకులు చంద్రన్న, లక్ష్మి, రాములు, వెంకటన్న, కురుమన్న, నా గేంద్ర, పరుశ రాములు, గట్టన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-07-01T05:37:28+05:30 IST