వేతనం రూ.21 వేలివ్వాలి

ABN , First Publish Date - 2021-07-27T04:36:20+05:30 IST

కనీస వేతనం రూ.21 వేలివ్వాలని, నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించాలని, సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు కలెక్టరేట్‌కు కదం తొక్కారు.

వేతనం రూ.21 వేలివ్వాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్‌ఏలు

వీఆర్‌ఏల ర్యాలీ, ధర్నా


నెలూరు(హరనాథపురం/వైద్యం), జూలై 26 : కనీస వేతనం రూ.21 వేలివ్వాలని, నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించాలని, సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామ రెవెన్యూ సహాయకులు కలెక్టరేట్‌కు కదం తొక్కారు. వందలాది మంది వీఆర్‌ఏలు సోమవారం నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి, కలెక్టర్‌రేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు కే పెంచల నర్సయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో అతి తక్కువ వేతనాలతో వీఆర్‌ఏలు పనిచేస్తున్నారని, చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  వీఆర్‌ఏలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన ఆ తర్వాత ఆ హామీలను విస్మరించారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. అర్హులైన వీఆర్‌ఏలకు ఉద్యోగోన్నతి కల్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీ హజరత్తయ్య, కే సుబ్బయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టీవీవీ ప్రసాద్‌, ఎస్‌కే రెహనాబేగం, ఎన సతీష్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T04:36:20+05:30 IST