గొంతు కోసుకున్న వీఆర్‌ఏ

ABN , First Publish Date - 2022-10-02T05:24:17+05:30 IST

గొంతు కోసుకున్న వీఆర్‌ఏ

గొంతు కోసుకున్న వీఆర్‌ఏ
గొంతుకోసుకున్న వీఆర్‌ఏ ఖాసీం

ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించడం లేదంటూ ఆత్మహత్యాయత్నం

 నెక్కొండ, అక్టోబరు1: వీఆర్‌ఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ రిలే దీక్షలు చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందన రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వీఆర్‌ఏ గుండ్రపల్లిలో శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీఆర్‌ఏల కథనం ప్రకారం. గుండ్రపల్లికి చెందిన స్థానిక వీఆర్‌ఏ మహమ్మద్‌ ఖాసీం రెండేళ్ల క్రితం వీఆ ర్‌ఏగా విధుల్లో చేరాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలుఉన్నారు. గత 69రోజుల  నుంచి జరుగుతున్న వీఆర్‌ఏల రిలే దీక్షలో తనూ పాల్గొంటున్నాడు. తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన ఖాసీం దీక్షా శిబిరం వద్ద బ్లేడ్‌తో గొంతుకోసుకున్నాడు. దీంతో అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడికి ప్రాణాపాయం లేదని వీఆర్‌ఏలు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపో వడం, దీక్షలతో కుటుంబ షోషణ భారమైందని, తన ఆత్మహత్యతోనైనా ముఖ్యమంత్రి స్పందిస్తాడనే ఉద్దేశంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. ఇటీవల కరోనా బారిన పడి చికిత్సకు రెండు లక్షల వరకు అప్పు చేశాడన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై సీమాఫర్హిన్‌ ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.

Updated Date - 2022-10-02T05:24:17+05:30 IST