రెవెన్యూ వ్యవస్థకు మూలస్తంభాలు వీఆర్‌ఏలు

ABN , First Publish Date - 2022-09-24T05:55:51+05:30 IST

రెవెన్యూ వ్యవస్థకు మూల స్తం భాలు వీఆర్‌ఏలేనని, వారి డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్ర భుత్వంపై ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

రెవెన్యూ వ్యవస్థకు మూలస్తంభాలు వీఆర్‌ఏలు
సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 

జగిత్యాల అర్బన్‌, సెప్టెంబరు 23:  రెవెన్యూ వ్యవస్థకు మూల స్తం భాలు వీఆర్‌ఏలేనని, వారి డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్ర భుత్వంపై ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేస్తున్న నిరవధిక స మ్మెకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో జరిగే ప్రతి ఘటనను ప్రభుత్వంకు అందజేసే వీఆర్‌ఏ వ్యవస్థ సమ్మెలో ఉంటే, ఎలాంటి ఇబ్బందులు లే కుండా వ్యవస్థ నడుస్తుందని మంత్రులు పేర్కొనడం విడ్డూరంగా ఉం దన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతోనే ప్రమోషన్‌ ఛానల్‌ నిలిచిపోయి, మీ భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎం దరో వీఆర్‌ఏలు బలవన్మరణాలకు పాల్పడ్డారని, ఇది ప్రభుత్వం వైఫ ల్యం కాదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం శాసన సభ సమావే శాల కొనసాగింపు కోసమే ప్రభుత్వం వీఆర్‌ఏలను ఉద్యమించకుండా జోకొట్టే ప్రయత్నం చేసిందన్నారు. డిమాండ్‌ల గురించి మాట్లాడకుం టే అవి చర్చలు ఎలా అవుతాయని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అంబేద్క ర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారం విద్యార్హతకు అనుగుణంగా, రిజర్వేషన్‌ ప్రాతిపదికన పదోన్నతులు పొందే అవకాశం ఉందని, పదోన్నతులు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందన్నారు. వీఆర్వో వ్య వస్థ రద్దు నిర్ణయమే తప్పని, రెవెన్యూ యంత్రాంగం, టీఎన్జీవోలు తక్షణమే పెన్‌డౌన్‌ స్ర్టైక్‌ చేసి వీఆర్‌ఏలకు మద్దతు తెలపాలని జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే మహిళా ఉ ద్యోగులకు ప్రసూతి సెలవులు లేని వ్యవస్థ లేదని, తెలంగాణ రాష్ట్రం లో మహిళా వీఆర్‌ఏలకు ప్రసూతి సెలవులు ఇవ్వకపోవడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం వీఆర్‌ఏల ఉసురు పోసుకు ని, బాగుపడదని హెచ్చరించారు. టీఎన్జీవోలు స్పందించకపోవడం వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని, పెన్‌డౌన్‌ చేయని పక్షంలో మిమ్మల్ని ఈ వ్యవస్థ క్షమించదన్నారు. వీఆర్‌ఏల పోరాటానికి ఎల్లవే ళలా అండగా ఉంటానని, ఏ స్థాయి పోరాటానికైనా సిద్దంగా ఉంటా నని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయ కులు గుండా మధు, పోతునక మహేష్‌, మునీంధర్‌రెడ్డి, మహేష్‌, రజినీకాంత్‌తో పాటు వీఆర్‌ఏల జేఏసీ బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T05:55:51+05:30 IST