VRAs Arrest: వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడి.. ఎక్కడికక్కడ అరెస్టు.. దిగొచ్చిన ప్రభుత్వం..

ABN , First Publish Date - 2022-09-13T18:39:07+05:30 IST

అసెంబ్లీ ముట్టడికి వస్తోన్న వందలాది మంది వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేశారు.

VRAs Arrest: వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడి.. ఎక్కడికక్కడ అరెస్టు.. దిగొచ్చిన ప్రభుత్వం..

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ముట్టడికి వస్తోన్న వందలాది మంది వీఆర్ఏలను (VRAs) పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ (Arrest) చేశారు. ఇందిరాపార్క్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గర 200 మంది వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు. ఈ సందర్బంగా నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను పోలీసులు దారి మళ్లిస్తున్నారు. ఛలో అసెంబ్లీలో ఏడు సంఘాలు పిలుపు ఇచ్చిన తరుణంలో హైదరాబాద్‌లోని ప్రధాన రోడ్లపై భారీగా పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి. అసెంబ్లీ ముట్టడికి దశలవారీగా తరలి వస్తున్న వీఆర్ఏలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.


వీఆర్ఏల డిమాండ్స్..

వీఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని, అర్హులకు ప్రమోషన్, కారుణ్య నియామకాలు చేపట్టాలని, మృతిచెందిన వీఆర్ఏల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


వీఆర్ఏల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం

వీఆర్‌ఏల ఆందోళనలతో ప్రభుత్వం దిగొచ్చింది. మంత్రి కేటీఆర్‌ వీఆర్ఏల ప్రతినిధులతో అసెంబ్లీ కమిటీ హాలులో భేటీ అయ్యారు. 20 మంది వీఆర్‌ఏలతో చర్చించారు. అనంతరం వీఆర్ఏలు మీడియాతో మాట్లాడుతూ పే స్కేల్, అర్హులకు ప్రమోషన్, కారుణ్య నియామకాలు,.. మృతిచెందిన వీఆర్‌ఏల కుటుంబాలను ఆదుకోవాలని కోరామన్నారు. తమ సమస్యలపై సీఎస్‌తో చర్చలు చేశామని చెప్పారని, మళ్లీ 20వ తేదీన చర్చలకు పిలుస్తామన్నారని తెలిపారు. సమ్మె విరమించమని మంత్రి కేటీఆర్ సూచించారన్నారు. సమ్మె విరమించేది తమ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామని వీఆర్ఏలు చెప్పారు.


తెలంగాణ  ఇంటలిజెన్స్ మరో ఫెయిల్యూర్.. 

కాగా వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడి విషయంలో తెలంగాణ  ఇంటలిజెన్స్ మరో ఫెయిల్యూర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేల వీఆర్ఏల ఆందోళన తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ చలో అసంబ్లీని తెలంగాణ ఇంటెలిజెన్స్ పసిగట్టలేకపోయింది. వీఆర్ఏలు మూడు రోజుల ముందుగానే బంధువుల ఇళ్లలోకి చేరుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కలలో ఉన్న అనేకమంది వీఆర్ఏలు వాళ్ల బంధువుల ఇళ్లల్లో మూడు రోజుల నుంచి మకం వేశారు. ఇవాళ 6వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు.


Updated Date - 2022-09-13T18:39:07+05:30 IST