TS News: కేసీఆర్‌కు నిరసన సెగ.. కాన్వాయ్ ముందు వీఆర్ఏల ఆందోళన

ABN , First Publish Date - 2022-10-01T20:34:58+05:30 IST

జనగామ (Janagama): జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్‌ (CM KCR)కు నిరసన సెగ తగిలింది.

TS News: కేసీఆర్‌కు నిరసన సెగ.. కాన్వాయ్ ముందు వీఆర్ఏల ఆందోళన

జనగామ (Janagama): జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్‌ (CM KCR)కు నిరసన సెగ తగిలింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు వీఆర్ఏ (VRA)లు ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏల ఆందోళనలతో సీఎం కేసీఆర్ కాన్వాయ్ దిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


కాగా సీఎం కేసీఆర్ (CM KCR) హన్మకొండలో ప్రతిమ వైద్య కళాశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ (Telangana)దే ప్రథమ స్థానమని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు తిట్టిపోయిన మర్నాడే అవార్డులు ఇస్తారన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ (Medical college)ని కూడా ఇవ్వలేదన్నారు. వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోనే వైద్య విద్యకు సరిపడా సీట్లు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-10-01T20:34:58+05:30 IST