
జిల్లాలో 60,154కు చేరిన మొత్తం బాధితుల సంఖ్య
విశాఖపట్నం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఆదివారం మరో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం బాధితుల సంఖ్య 60,154కు చేరింది. వీరిలో వైరస్ నుంచి 59,492 మంది కోలుకోగా, మరో 129 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఇప్పటివరకు 533 మంది మృత్యువాత చెందారు.