నేడు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

ABN , First Publish Date - 2021-03-03T06:20:31+05:30 IST

చిన్నారుల్లో ఎక్కువగా కనిపించే నులిపురుగులు నియంత్రణకు ఆల్బెండజోల్‌ మాత్రలను మింగించాలని రాష్ట్రీయ బాలస్వాస్థ్య జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు.

నేడు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
డాక్టర్‌ చంద్రశేఖర్‌

రాష్ట్రీయ బాలస్వాస్థ్య జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌

విశాఖపట్నం, మార్చి 2(ఆంధ్రజ్యోతి) : చిన్నారుల్లో ఎక్కువగా కనిపించే నులిపురుగులు నియంత్రణకు ఆల్బెండజోల్‌ మాత్రలను మింగించాలని రాష్ట్రీయ బాలస్వాస్థ్య జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు. ఈ నెల మూడో తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చేపట్టనున్న ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీ  వివరాలను ఆయన వెల్లడించారు. నులిపురుగులు ఉండే చిన్నారులు బలహీనంగా ఉండడంతోపాటు ఎదుగుదల లేకుండా పౌష్టికాహార లోపం బాధితులు మాదిరిగా కనిపిస్తారన్నారు. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారికి ఈ మాత్రలను అందించడం వల్ల వారి ఎదుగుదలకు దోహదం చేయవచ్చన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లోని చిన్నారులకు వీటిని అందించాలన్నారు.

Updated Date - 2021-03-03T06:20:31+05:30 IST