రబీలో 25 శాతం ఇతర పంటలు సాగు చేయండి

ABN , First Publish Date - 2020-09-23T08:39:33+05:30 IST

రబీ సీజన్‌లో పప్పుశనగకు బదులుగా 25 శాతం విస్తీర్ణంలో ఇతర రకాల పంటలు సాగు చేయాలని ఇన్‌చార్జి జేడీఏ రామకృష్ణ మంగళవారం ప్రకటనలో సూచించారు.

రబీలో 25 శాతం ఇతర పంటలు సాగు చేయండి

ఇన్‌చార్జి జేడీఏ రామకృష్ణ 

అనంతపురం వ్యవసాయం, సెప్టెంబరు 22: రబీ సీజన్‌లో పప్పుశనగకు బదులుగా 25 శాతం విస్తీర్ణంలో ఇతర రకాల పంటలు సాగు చేయాలని ఇన్‌చార్జి జేడీఏ రామకృష్ణ మంగళవారం ప్రకటనలో సూచించారు. జిల్లా వ్యాప్తంగా నల్లరేగడి భూముల్లో గతేడాది రబీ సీజన్‌లో 90496 హెక్టార్లలో పప్పుశనగ సాగు చేశారన్నారు.


ఈఏడాది 75 శాతం విస్తీర్ణంలో పప్పుశనగ సాగు చేసి, మిగిలిన 25 శాతం విస్తీర్ణంలో ఇతర రకాల పంటలైన జొన్నలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, తెల్లకుసాలు, ధనియాలు, స్వల్ప కాలిక కంది, పెసలు విత్తుకోవాలని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలో 22624 హెక్టార్లలో (25 శాతం విస్తీర్ణం) సాగు చేసేందుకు ఇతర రకాల పంటల విత్తనాలు 2198 క్వింటాళ్లు అవసరమవుతాయన్నారు.


ఇందులో జొన్నలు 9955 హెక్టార్లు, మొక్కజొన్న 1148, పొద్దుతిరుగుడు 3103, తెల్లకుసాలు 2725, ధనియాలు 2675, స్వల్ప కాలిక కంది 2635, పెసలు 410 హెక్టార్లలో సాగుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. గతేడాది రబీలో సాగు చేసిన పప్పుశనగకు పూర్తిస్థాయిలో మార్కెట్‌ చేసుకోలేకపోయారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, పంటలు సాగు చేసుకోవాలని రైతులను కోరారు.

Updated Date - 2020-09-23T08:39:33+05:30 IST