ఆటోమేషన్‌తో మంచి ఫలితాలు

ABN , First Publish Date - 2020-10-27T10:35:39+05:30 IST

విశాఖపట్నం పోర్టులో ఆటోమేషన్‌ విధానం వల్ల పారదర్శకత పెరిగి కాంట్రాక్టర్లు, ఇతర పనివార్లకు త్వరితగతిన చెల్లింపులు జరుగుతున్నాయని పోర్టు చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ జె.ప్రదీప్‌కుమార్‌ తెలిపారు.

ఆటోమేషన్‌తో మంచి ఫలితాలు

నేటి నుంచి విజిలెన్స్‌ వారోత్సవాలు

పోర్టు చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ జె.ప్రదీప్‌కుమార్‌


విశాఖపట్నం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టులో ఆటోమేషన్‌ విధానం వల్ల పారదర్శకత పెరిగి కాంట్రాక్టర్లు, ఇతర పనివార్లకు త్వరితగతిన చెల్లింపులు జరుగుతున్నాయని పోర్టు చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ జె.ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 27 నుంచి విజిలెన్స్‌ వారోత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఆయన సోమవారం  విలేకరులతో మాట్లాడారు. ఇంతకుముందు బిల్లుల కోసం కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు ఆటోమేషన్‌ వల్ల బిల్లు సమర్పించిన తరువాత నేరుగా కాంట్రాక్టర్‌ ఖాతాలోకే నగదు జమ అవుతోందన్నారు.


దీనివల్ల కాలం ఆదాతోపాటు అవినీతికి ఆస్కారం తగ్గిందన్నారు.  ఈ నెల 27 నుంచి డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,  నగర పౌరులు కూడా భాగస్వాములై ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. క్యుఆర్‌  కోడ్‌ స్కాన్‌ చేస్తే ఈ ప్రతిజ్ఞ వస్తుందని, ఇందులో పాల్గొన్నవారికి విజిలెన్స్‌ తరఫున సర్టిఫికెట్లు కూడా ఇస్తామని చెప్పారు. ఈ ఏడాది ‘అప్రమత్త భారత్‌... సంపన్న భారత్‌’ నినాదంతో ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.

Updated Date - 2020-10-27T10:35:39+05:30 IST