జీవీఎంసీ ఎన్నికలకు 200 బస్సులు

ABN , First Publish Date - 2021-03-02T06:34:43+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల విధులకు 200 బస్సులు కేటాయించాలని ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది

జీవీఎంసీ ఎన్నికలకు 200 బస్సులు

ద్వారకాబస్‌స్టేషన్‌, మార్చి 1 : జీవీఎంసీ ఎన్నికల  విధులకు 200 బస్సులు కేటాయించాలని ప్రజా రవాణా సంస్థ (పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణాధికారి రిక్విజేషన్‌ మేరకు ఈ బస్సులు కేటాయించినట్టు అధికారులు వెల్లడించారు.  ఈ నెల 10న జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులకు కార్పొరేటర్‌ అభ్యర్థుల ఎన్నికకు పోలింగ్‌ జరుగనుంది. పోలింగ్‌ అధికారులను, సిబ్బందిని, పోలింగ్‌ మెటీరియల్‌, పోలింగ్‌ బాక్సులను ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ఈ బస్సులు అవసరమవుతాయని వెల్లడించారు. తొమ్మిదో తేదీన ఉదయం సంబంధిత జోనల్‌ కార్యాలయాలకు బస్సులు అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-02T06:34:43+05:30 IST