కేంద్రం ఆంధ్రుల ఆగ్రహం చవిచూడక తప్పదు

ABN , First Publish Date - 2021-03-09T06:49:52+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజల ఆగ్రహం చవి చూడక తప్పదని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు

కేంద్రం  ఆంధ్రుల ఆగ్రహం చవిచూడక తప్పదు
రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న మహిళలు

ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ 

కూర్మన్నపాలెం, మార్చి 8: కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజల ఆగ్రహం చవి చూడక తప్పదని  ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా రక్షించాలంటూ 25 రోజులుగా ఉక్కు ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఎవరి కోసం ప్రైవేటీకరణ ఆగదని కేంద్రమంత్రి అనటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయానికి ఒడి గడుతున్నారని అన్నారు.

 తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ మాట్లాడుతూ ఈ నెల 10న జరగబోయే జీవీఎంసీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేిపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, బోసుబాబు, బూసి వెంకటరావు, బొడ్డు పైడిరాజు, మస్తానప్ప, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌, వరసాల శ్రీనివాసరావు, దొమ్మేటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-09T06:49:52+05:30 IST