వెల్లివిరిసిన చైతన్యం

ABN , First Publish Date - 2021-01-25T06:42:20+05:30 IST

జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువకులు కొత్తగా ఓటు నమోదుకు ముందుకొచ్చారు. ఓటర్ల నమోదుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారు.

వెల్లివిరిసిన చైతన్యం

జిల్లాలో కొత్తగా 42,312 మంది ఓటర్లు నమోదు

వీరిలో 30 వేల మంది 19 ఏళ్ల లోపు వారే..

మొత్తం ఓటర్లు 36,67,693 మంది

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

విశాఖపట్నం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువకులు కొత్తగా ఓటు నమోదుకు ముందుకొచ్చారు. ఓటర్ల నమోదుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నారు. ప్రతి ఏటా ఓటర్ల సవరణ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. దీనిలోభాగంగా జిల్లాలో 15 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో 42,312 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. వీరిలో 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన వారు 29,664 మంది ఉన్నారు. సవరించిన జాబితా మేరకు జిల్లాలో మొత్తం ఓటర్లు 36,67,693గా ఉన్నారు. కాగా యువ ఓటర్లుగా 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు నమోదైన వారిలో గరిష్ఠంగా అనకాపల్లిలో 5,666 మంది ఉండడం గమనార్హం. తరువాత భీమిలిలో 2,647, మాడుగులలో 2,4,68, చోడవరంలో 2,323, ఎలమంచిలిలో 2,289, పెందుర్తిలో 2,178, గాజువాకలో 2,037 మంది ఉన్నారు. ఇంకా నర్సీపట్నంలో 1,665, పాయకరావుపేటలో 1,640, విశాఖ ఉత్తరంలో 1,534, అరకులో 1,344, విశాఖ పశ్చిమలో 1,185, విశాఖ దక్షిణంలో 972, విశాఖ తూర్పులో 961, పాడేరులో 755 మంది నమోదయ్యారు. వీరంతా తొలిసారిగా ఓటు హక్కు వినియోగానికి అర్హులు. 

నేటి నుంచి కొత్త ఓటర్లకు ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌

ఇప్పటివరకు ఉన్న ఓటరు కార్డులకు బదులుగా ఈ-ఎపిక్‌ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అయితే జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సోమవారం నుంచి కొత్తగా ఓటర్లుగా నమోదైన వారంతా ‘ఈ-ఎపిక్‌’ కార్డులు డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మిగిలిన ఓటర్లంతా వచ్చే నెల ఒకటి నుంచి ఈ-ఎపిక్‌ కార్డులు డౌన్‌లోడ్‌కు అవకాశం ఇచ్చారు. ఇందుకు ప్రతి ఓటరు తన మొబైల్‌ నుంచి ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఈ-ఎపిక్‌ కార్డు డౌన్‌లోడ్‌కు అవకాశం ఇచ్చారు. ుఽటఠిఞ.జీుఽ, ఠి్ట్ఛౌటఞౌట్చజూ.్ఛఛిజీ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ల నుంచి కొత్తగా ఓటరు కార్డు పొందే అవకాశం కల్పించారు. అయితే కొత్తవిధానం కావడంతో ఓటర్లకు అవగాహన కోసం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, ఈఆర్‌వో, ఏఈఆర్‌వో కార్యాలయాల్లో డౌన్‌లోడ్‌కు ఏర్పాటు చేశారు. 

యువ ఓటర్లు... వృద్ధులకు సత్కారం

ఓటర్లలో చైతన్యం తీసుకురావడంతోపాటు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీనిలోభాగంగా 11వ జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని సోమవారం జిల్లాలో పలువురు ఓటర్లను సత్కరించనున్నారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న 18 నుంచి 19 ఏళ్ల మధ్యనున్న యువకులు ఐదుగురు, వృద్ధ ఓటర్లు మరో ఐదుగురిని ఎంపిక చేశారు. 

నేడు కలెక్టర్‌కు అవార్డు ప్రదానం

ఓటర్ల జాబితా సవరణ, తుది జాబితా ప్రకటన తదితర అంశాలపై ఓటర్లలో ఉత్సాహం నింపి, ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా ఎంపికైన విశాఖ కలెక్టర్‌ వి. వినయ్‌చంద్‌ సోమవారం రాష్ట్ట్ర గవర్నర్‌ నుంచి అవార్డు తీసుకోనున్నారు. 


Updated Date - 2021-01-25T06:42:20+05:30 IST