వీఎస్‌యూలో జాతీయ బాలిక దినోత్సవం

ABN , First Publish Date - 2022-01-25T02:45:51+05:30 IST

మండలంలోని కాకుటూరు వద్ద ఉన వీఎస్‌యూలో సోమవారం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ‘బాలిక వివక్ష ని

వీఎస్‌యూలో జాతీయ బాలిక దినోత్సవం
జాతీయ బాలిక దినోత్సవం అవశ్యకతను వివరిస్తున్న రిజిస్ర్టార్‌ విజయకృష్ణారెడ్డి

వెంకటాచలం, జనవరి 24 : మండలంలోని కాకుటూరు వద్ద ఉన వీఎస్‌యూలో సోమవారం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ‘బాలిక వివక్ష నిర్మూలన - సమానత్వం, సాధికారిత ఆవశ్యకత’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ సుందరవల్లి పాల్గొని బాలికలు ఎదుర్కొనే  సమస్యల గురించి, వాటిని ఆధిగమించి ఎలా సాధికారత దిశగా అడుగులు వేయాలని సూచించారు. అనంతరం జేసీ రోజ్‌మాండ్‌  మాట్లాడుతూ బాలికల సంరక్షణకు ఉన్న చట్టాలు, పథకాల గురించి వివరించారు. రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి మాట్లాడుతూ బాలికల సంరక్షణలో తల్లులు ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఎం చంద్రయ్య, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌, డాక్టర్‌ కే సునీత, డాక్టర్‌ వై విజయ, డాక్టర్‌ శ్రీకన్యారావు, డాక్టర్‌ ఆర్‌ మధుమతి, డాక్టర్‌ సీహెచ్‌ విజయ తదితరులు పాల్గొన్నారు.


ఇందుకూరుపేటలో...


ఇందుకూరుపేట, జనవరి 24 : ఇందుకూరుపేట సీడీపీవో హేనాసుజన ఆధ్వర్యంలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాలతో సూపర్‌వైజర్స్‌, అంగన్‌వాడీ టీచర్స్‌ ర్యాలీ నిర్వహించారు.అనంతరం హేనాసుజన మాట్లాడుతూ బాలికలు హక్కులను ఉపయోగించుకోవాలని కోరారు.  గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ల గురించి తెలుసుకోవాలని తెలియజేశారు.  


 టీపీ గూడూరులో..

తోటపల్లిగూడూరు, జనవరి 24: మండలంలోని సౌత్‌ఆములూరు ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ మహిళా పోలీసు శ్రీలేఖ మాట్లాడుతూ సమాజంలో బాలికలు ఎలా మెలగాలనే అంశాన్ని వివరించారు. ఉపాధ్యాయులు వసంతలక్ష్మి, అహ్మద్‌ బాషా తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఏడవ తరగతికి చెందిన దివ్యాంగ విద్యార్థిని ఎం.ప్రన్వికను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సుభాషిణి, నివేదిత తదితరులు పాల్గొన్నారు.



విద్యతో బాలికల అభ్యున్నతి


ముత్తుకూరు, జనవరి24: జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా అగ్గిపుల్లపై బాలికా దినోత్సవ సూక్ష్మచిత్రాన్ని రూపొందించారు సుబ్బారెడ్డిపాళెం ప్రాథమికోన్నత పాఠశాల తెలుగు పండిట్‌ సోమా పద్మారత్నం. విద్యతో బాలికలు అభ్యున్నతిని సాధించగలరని ఆయన అన్నారు. సమాజంలో బాలికల పట్ల బాధ్యత, సంస్కారంతో మెలగడం అలవర్చుకోవాలన్నారు. 




Updated Date - 2022-01-25T02:45:51+05:30 IST