పరిశోధనలు పెంచుతాం!

ABN , First Publish Date - 2022-05-24T05:48:06+05:30 IST

వీఎ్‌సయూ వీసీగా నేను బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు అవుతోంది. వర్సిటీలో రీసెర్చ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాను. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయించి, రీసెర్చ్‌లు చేసేవారిని ప్రోత్సహిస్తున్నాం.

పరిశోధనలు పెంచుతాం!
వీఎ్‌సయూ వీసీ సుందరవల్లి

వర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

విద్యార్థుల ఉపాధి అవకాశాలే లక్ష్యం

ఇప్పటికే పలు కంపెనీలతో ఎంవోయూలు

‘ఆంధ్రజ్యోతి’తో వీసీ సుందరవల్లి


‘‘సింహపురి విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఇప్పటికే ఓ ప్రణాళిక రూపొందించాను. ముఖ్యంగా వర్సిటీ పరిధిలో పరిశోధనల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నా’’ అని ఆ వర్సిటీ ఉపకులపతి ఆచార్య సుందరవల్లి అన్నారు. మంగళవారం వీఎ్‌సయూ స్నాతకోత్సవం సందర్భంగా ఆమె ‘ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..


‘‘వీఎ్‌సయూ వీసీగా నేను బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు అవుతోంది. వర్సిటీలో రీసెర్చ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాను. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు  చేయించి, రీసెర్చ్‌లు చేసేవారిని ప్రోత్సహిస్తున్నాం. రీసెర్చ్‌లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.  ఇక యూనివర్సిటీ అభివృద్ధికి ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించుకొని అందరి సహకారంతో ఆ దిశగా పని చేస్తున్నాను. వీఎ్‌సయూలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసంగా పలు కంపెనీలతో ఎంవోయూలు తీసుకున్నాం. వాటిలో శ్రీసిటీ, ఆదాని వంటి కంపెనీలతోపాటు మరికొన్ని పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి.  ఇంక్‌పేషెంట్‌ సెంటర్‌ పెట్టేందుకు స్పేస్‌ ప్రాబ్లమ్‌ ఉంది. దాన్ని సరిచేసేందుకు ప్రత్నిస్తున్నాం. మెరైన్‌ బయాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, ఎంబీఏ, టూరిజం మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులలో వంద శాతం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.’’ 

- వెంకటాచలం 

Updated Date - 2022-05-24T05:48:06+05:30 IST