మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-18T05:38:50+05:30 IST

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. వాసిరెడ్డి వెంకట్రాది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో శనివారం మహిళా భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ప్రసంగిస్తున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

పెదకాకాని: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. వాసిరెడ్డి వెంకట్రాది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో శనివారం మహిళా భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. సరదాతో ప్రారంభమయ్యే మత్తు పదార్థాలు విద్యార్థులను బానిసలుగా మార్చి నేరప్రవృత్తి వైపు పయనించేలా చేస్తుందన్నారు. అందువల్ల మాదకద్రవ్యాలకు బానిస కాకుండా సత్ప్రవర్తనతో మెలగాలని విద్యార్థులకు సూచించారు.  కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలిగేలా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  ఈవ్‌టీజింగ్‌, మాదకద్రవ్యాల దుష్ఫలితాలపై  అఘుచిత్రాలను ప్రదర్శించారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన పోలీసు కంప్లైంట్‌ బాక్స్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్‌సీసీ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆళ్ళ శ్రీవాణి, మంగళగిరి డీఎస్పీ దుర్గాప్రసాదు, పెదకాకాని సీఐ  వాసు, అధ్యాపకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-18T05:38:50+05:30 IST