సకాలంలో వైద్యం అందక గిరిజన మహిళ మృతి

ABN , First Publish Date - 2021-04-24T04:19:34+05:30 IST

మండలంలోని మర్రిపల్లి గ్రామంలో గిరిజన కాలనీకి చెందిన ఓ తల్లీకొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత రెండు రోజుల నుంచి వైద్యం అందక మృత్యువుతో పోరాడుతున్నారు.

సకాలంలో వైద్యం అందక గిరిజన మహిళ మృతి

 మృత్యువుతో పోరాడుతున్న కుమారుడు


పొదలకూరు, ఏప్రిల్‌ 23 : మండలంలోని మర్రిపల్లి గ్రామంలో గిరిజన కాలనీకి చెందిన ఓ తల్లీకొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత రెండు రోజుల నుంచి వైద్యం అందక మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. తక్షణమే స్పందించిన అధికారులు నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించినా ఫలితం లేకపోయింది. వైద్యశాల సిబ్బంది ఆమెను చేర్చుకోకపోవడంతో మృతి చెందింది. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు మేరకు.. తీవ్రంగా గాయపడ్డ తల్లీ, కుమారుడికి  వైద్యం అందించేందుకు మండల అధికారులు గురువారం రాత్రి గ్రామస్థులు రామకృష్ణ, జనార్దన్‌ సాయంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ ఆసుపత్రి వారు అడ్మిట్‌ చేసుకోలేదు. దీంతో చేసేది లేక మరలా ఇంటికి రాత్రి 12 గంటలకు తిరిగి వచ్చేశారు. ఈ క్రమంలో సకాలంలో వైద్యం అందకపోవడంతో తల్లి (కిష్టమ్మ) మృతి చెందింది. శుక్రవారం తహసీల్దారు, సీఐ, ఎస్‌ఐలు గాయపడ్డ కుమారుడు అంకయ్యను నెల్లూరు జీజీహెచ్‌కు సిఫార్సు ద్వారా పంపారు. కిష్టమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-04-24T04:19:34+05:30 IST