ఆర్‌వోఎఫ్‌ఆర్‌పై వినతుల స్వీకరణ

ABN , First Publish Date - 2020-09-23T11:37:53+05:30 IST

భూమి లేని గిరిజన రైతులను గుర్తించేందుకు గ్రామ సచివాలయాల్లో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ (రిజ్వరేషన్‌ ఆఫ్‌ ఫారె

ఆర్‌వోఎఫ్‌ఆర్‌పై వినతుల స్వీకరణ

పార్వతీపురం, సెప్టెంబరు 22 : భూమి లేని గిరిజన రైతులను గుర్తించేందుకు గ్రామ సచివాలయాల్లో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ (రిజ్వరేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌)పై వినతులు స్వీకరిస్తున్నట్టు ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ తెలిపారు.


తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూమిలేని గిరిజన రైతులను గుర్తించి పట్టాలు అందించేందుకు ఈ నెల 24 నుంచి సబ్‌ప్లాన్‌ మండలాల్లో ప్రతిరోజూ ఆర్‌వోఎఫ్‌ఆర్‌పై వినతులు స్వీకరిస్తామ న్నారు.


ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని సచివాలయాల్లో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో వినతులు తీసుకుంటామన్నారు. 

నేడు టెలీ స్పందన

ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో సబ్‌ప్లాన్‌ మండలాలకు చెందిన గిరిజన రైతుల ఆర్‌వోఎఫ్‌ఆర్‌ సమస్యల పరిష్కారానికి టెలీస్పందన ద్వారా బుధవారం వినతులు స్వీకరించనున్నట్టు పీవో కూర్మనాథ్‌ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫోన్‌ ద్వారా వినతులు స్వీకరిస్తామన్నారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూ పట్టాలకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి ఐటీడీఏ కార్యాలయ నెంబరు 08963-220044కు ఫోన్‌ చేయాలని కోరారు.

Updated Date - 2020-09-23T11:37:53+05:30 IST