డిసెంబరు నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2020-09-29T11:57:24+05:30 IST

జిల్లాలో డిసెంబరు నుంచి ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ చేయనున్నట్లు జేసీ కిషోర్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లతో మాట్లాడారు.

డిసెంబరు నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ

కలెక్టరేట్‌, సెప్టెంబరు 28: జిల్లాలో డిసెంబరు నుంచి ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ చేయనున్నట్లు జేసీ  కిషోర్‌ కుమార్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లతో మాట్లాడారు.  ప్రస్తుతం జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాల్లో ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేయాలని సూచించారు. 


ఈ రైస్‌ పంపిణీ చేయాలంటే ఏడాదికి లక్షా 40 వేలు టన్నులు అవసరమని చెప్పారు. ప్రసుత్తం 40 సార్ట్‌క్స్‌ మిల్లులు ఉన్నాయని, కొత్తగా మరో పది  యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.  నవంబరు నుంచి ధాన్యం సేకరణకు సిద్ధం కావాలని ఆదేశించారు.


ఇదిలా ఉంటే జిల్లాలోని జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు. రాయపూర్‌ నుంచి విశాఖ రహ దారికి, సాలూరు బైపాస్‌ రోడ్డుకు 35.47 హెక్టార్ల భూమికి సంబంధించి బిల్లుల చెల్లింపులకు ప్రతిపాదనలు పంపామన్నారు.   ఈ  సమావేశంలో పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ విధేఖర్‌, ఆర్డీవో భవానీ శంకర్‌, సివిల్‌ డీఎం వరకుమార్‌, ఏజీఎం కల్యాణి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-09-29T11:57:24+05:30 IST