మహిళల రక్షణపై దృష్టిపెట్టండి

ABN , First Publish Date - 2020-09-29T12:04:58+05:30 IST

మహిళల రక్షణపై దృష్టి పెట్టాలని ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ రాజకుమారి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 26 ఫిర్యాదులు వచ్చాయి.

మహిళల రక్షణపై దృష్టిపెట్టండి

ఎస్పీ రాజకుమారి

విజయనగరం క్రైం, సెప్టెంబరు 28:  మహిళల రక్షణపై  దృష్టి పెట్టాలని ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ రాజకుమారి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 26 ఫిర్యాదులు వచ్చాయి.


ఎక్కువగా మహిళల నుంచే ఫిర్యాదులు రావడంతో ఎస్పీ స్పందించారు. మహిళలను హింసించే వారిపై కఠినంగా వ్యవహరించాలని  సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.  కార్యక్రమంలో డీఎస్పీలు మోహనరావు, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

 

నిస్వార్థ సేవలందించండి

పోలీస్‌ వ్యవస్థ బాధ్యతాయుతమైనదని..నిజాయతీతో ప్రజలకు సేవలందించాలని ఎస్పీ రాజకుమారి సూచించారు. అనంతపురంలో ఎస్‌ఐలుగా, ఆర్‌ ఎస్‌ఐలుగా శిక్షణ పొందినవారు సోమవారం ఎస్పీ రాజకుమారిని కలిశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. 

Updated Date - 2020-09-29T12:04:58+05:30 IST