జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌

ABN , First Publish Date - 2020-10-29T08:14:06+05:30 IST

జిల్లావ్యాప్తంగా పోలీస్‌శాఖ ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌

 బాల కార్మికుల గుర్తింపు


విజయనగరం క్రైమ్‌, అక్టోబరు 28: జిల్లావ్యాప్తంగా పోలీస్‌శాఖ ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో చైల్డ్‌లైన్‌, ఐసీడీఎస్‌ సిబ్బందితో సంయుక్తంగాచేపట్టిన కార్యక్రమంలో భాగంగా వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించారు. పరిశ్రమలు, హోటళ్లు, వివిధ దుకాణాలను తనిఖీ చేశారు. బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి అప్పగించారు. కరోనా నేపథ్యంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్పీ రాజకుమారి తెలిపారు. విజయనగరం సబ్‌ డివిజన్‌ పరిధిలో 38 మంది బాలురు. నలుగురు బాలికలు. బొబ్బిలిలో 34 బాలురు, ఒక బాలికను గుర్తించినట్టు చెప్పారు. పార్వతీపురంలో 13 మంది బాలురును గుర్తించామన్నారు. కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, సీఐలు వెంకట్రావు, మురళీ, శ్రీనివాసరావు, ఆర్‌ఐ చిరంజీవి, సీడబ్ల్యూసీ అధ్యక్షుడు లక్ష్మణరావు, సభ్యులు చిట్టిబాబు, కోఆర్డినేటర్‌ రిజిత పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-29T08:14:06+05:30 IST