Advertisement

తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం..

Oct 30 2020 @ 06:25AM

 వేపాడ:  గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే తక్షణమే పరిష్క రిస్తామని గ్రామీణ నీటి సరఫరా విభాగపు డీఈఈ ఈశ్వరీభాయి అన్నారు. వల్లంపూడి, కుమ్మపల్లి గ్రామాల్లో ఆమె గురువారం పర్య టించారు. వల్లంపూడిలో బోరు నుంచి బురుదనీరు రావడాన్ని గుర్తించి, సమస్య పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.  కుమ్మపల్లిలో పైపులైన్‌ లీకేజీలను సరి చేయించారు. రక్షిత మంచి నీటి పథకాలను పరిశీలించారు. గ్రామాల్లో ఏవిధమైన తాగునీటి సమస్యలు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈఈ దేవి, సిబ్బంది ఉన్నారు. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.