వాడి‘వేడి’గా..

ABN , First Publish Date - 2021-03-01T04:57:43+05:30 IST

రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న వారు చమట్లు కక్కుతూనే ముందుకెళ్తున్నారు. అభ్యర్థులు ఆదివారం చాలా అవస్థలు పడడం విజయనగరంలో కనిపించింది. ఎండ వేడికి తట్టుకోలేక చిన్న నీడ దొరికినా కాసేపు సేదతీరేందుకు ప్రయత్నించారు. వారి కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు, బంధువులు మధ్యాహ్నానికి చెల్లాచెదురయ్యారు.

వాడి‘వేడి’గా..

ఎండల్లో అభ్యర్థుల పాట్లు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న వారు చమట్లు కక్కుతూనే ముందుకెళ్తున్నారు. అభ్యర్థులు ఆదివారం చాలా అవస్థలు పడడం విజయనగరంలో కనిపించింది. ఎండ వేడికి తట్టుకోలేక చిన్న నీడ దొరికినా కాసేపు సేదతీరేందుకు ప్రయత్నించారు. వారి కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు, బంధువులు మధ్యాహ్నానికి చెల్లాచెదురయ్యారు. వేడికి ఉక్కిరిబిక్కిరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో చక్కగా ప్రచారం ముగించేవారు. ఉదయం నుంచి సాయత్రం వరకు ప్రచారం చేసినా సూర్యుని ప్రతాపం ఉన్నా చలికారణంగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఉదయం 10గంటల తరువాత ప్రచారం అంటేనే భయపడే పరిస్థితి ఉంటోంది. ప్రచారంలో వెంట తెచ్చే వాహనాల్లో వాటర్‌ ప్యాకెట్లు, శీతల పానీయాలు తెస్తున్నారు. అయితే కొందరు మాత్రం అప్పటికప్పుడు ప్రచారం షెడ్యూల్‌ను మార్చుకుంటున్నారు. ఉదయం 10గంటల లోపు ప్రచారం ముగించాలని భావిస్తున్నారు.  అలాగే సాయంత్రం 4గంటల తరువాత ప్రచారాన్ని ముమ్మరం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ మార్చి 10న జరుగనుంది. ఈ 10 రోజుల్లో ఎండలు మరింత మండిపోయే పరిస్థితి ఉందని వాతావరణ కేంద్రాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిసి అభ్యర్థులు కాస్త బెంబేలవుతూనే  మందీమార్బలాన్ని ఎలాగైనా తీసుకువెళ్లాలని ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. 


Updated Date - 2021-03-01T04:57:43+05:30 IST