ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-09-17T06:40:44+05:30 IST

ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వవలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌చేశారు.

ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలి
నిడమనూరులో మాట్లాడుతున్న టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధానకార్యదర్శి వెంకటేశం

 మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో వేతన జీవుల వెతలు 

 టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి

నల్లగొండ క్రైం/ నిడమనూరు/చండూరు/మర్రిగూడ/చింతపల్లి,   సెప్టెంబరు 16: ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వవలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ట్రెజరీ కార్యాలయం మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో వేతన జీవుల వెతలకు అంతు లేకుండా పోయిందని ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేసి, ఆయన మాట్లా డారు. గత ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించేవని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జీతాలు సకాలంలో చెల్లించకపోవడం శోచనీయమని అన్నారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో వేతన జీవుల వెతలకు అంతు లేకుండా పోయిందని అన్నారు. సప్లమెంటరీ వేతనాలు, పీఆర్సీ, డీఏ, బకాయిలు కూడా ట్రెజరీ కార్యాలయంలో పాసైన 3 నెలల నుంచి 4 నెలల వరకు పడుతున్నాయ న్నారు. కొన్ని డీఏ బిల్లులు సకాలంలో సబ్మిట్‌ చేసినా అవి ఆర్థిక సంవత్సరంలో పాస్‌ కాకపోవడం వల్ల మళ్లీ బిల్లుల సబ్మిట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేత నాలను, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లను ప్రతినెలా ఒకటోతేదీన విడుదల చేయాలని, సప్లమెంటరీ క్లైమ్‌ల నిధుల విడుదలకు నిర్ధిష్టమైన సమ యాన్ని నిర్ధేశించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి నర్ర శేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు అరుణ, ఆదిశేఖర్‌, వీరాచారి, మాణిక్యం, నర్సింహ, రాగి రవీందర్‌, సైదులు, రవీందర్‌ ఉన్నారు. నిడమనూరు మండల కేంద్రంలోని సబ్‌ ట్రెజరీ కార్యాలయం ఎదుట  టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిడమనూరు, హాలియా, త్రిపురరాం, పెద్దవూర, తిరుమలగిరిసాగర్‌ మండలాల ఉపాధ్యాయులు నిర్వహించిన ధర్నాలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నలపరాజు వెంకన్న, రాజు, విజయలక్ష్మి, కొమరాజు సైదులు, అంజయ్య, ప్రసాద్‌, వీరాసింగ్‌, బొమ్ము ఉపెందర్‌, మోతీలాల్‌, సయ్యద్‌మియా, కృష్ణ, శంకర్‌నాయక్‌,  సైదులు, బీవీ రావు, శంభయ్య, ప్రశాంత్‌, గంగధరాచారి, రజియా పాల్గొన్నారు. చండూరులో నిర్వహించిన ధర్నాలో సంఘం జిల్లా కార్యదర్శి గేర నర్సింహ, సిహెచ్‌.రామలింగయ్య, మండల అధ్యక్షుడు గురిజాల దానయ్య, ప్రధాన కార్యదర్శి నాంపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి ఎస్టీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శులు గ్యార నర్సింహ, జి.అరుణ, సీహెచ్‌ మట్టారెడ్డి నాయకులు సత్యనారాయణ, కృష్ణారెడ్డి, శ్యాంకుమార్‌, శ్రీనివాస్‌, జీవంత్‌ పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌.మట్టారెడ్డి, జింకల సత్యనారా యణ, కోట్ల యాదగిరి అన్నారు.  చింతపల్లి మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు చిన్న వెంకటేశ్వర్లు, హనుమంతు నాయక్‌, ఏడుకొండలు, నర్సింహ ఉన్నారు. 

Updated Date - 2021-09-17T06:40:44+05:30 IST