Viral Video: వెయిటర్‌ ట్యాలెంట్‌కు నెటిజన్ల ఫిదా.. జీతం పెంచాల్సిందే అంటూ కామెంట్లు..

ABN , First Publish Date - 2022-09-07T02:21:49+05:30 IST

కష్టపడే తత్వం, డెడికేషన్ ఉంటే ఏ పనిలో ఉన్నా సమర్థంగా పని చేయవచ్చని ఇప్పటికి చాలా మంది నిరూపించారు.

Viral Video: వెయిటర్‌ ట్యాలెంట్‌కు నెటిజన్ల ఫిదా.. జీతం పెంచాల్సిందే అంటూ కామెంట్లు..

కష్టపడే తత్వం, డెడికేషన్ ఉంటే ఏ పనిలో ఉన్నా సమర్థంగా పని చేయవచ్చని ఇప్పటికి చాలా మంది నిరూపించారు. ఓ హోటళ్లో వెయిటర్‌గా పని చేస్తున్న యువకుడు తన అద్భుత నైపుణ్యంతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాడు. ఒకేసారి డజనుకు పైగా ఆర్డర్లను కస్టమర్లకు అందించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



ఆ వీడియో ప్రకారం.. ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్న యువకుడు కస్టమర్లకు అందించాల్సిన ఫుడ్ ప్లేట్‌లను తన ముందు పెట్టుకున్నాడు. వాటిని జాగ్రత్తగా ఒకదానిపై మరోకటి పెట్టుకుని కస్టమర్ల దగ్గరకు తీసుకెళ్లాడు. వాటిని జాగ్రత్తగా అందరికీ అందించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ వెయిటర్‌కు వెంటనే శాలరీ పెంచాలంటూ కామెంట్‌లు చేస్తున్నారు. 

Updated Date - 2022-09-07T02:21:49+05:30 IST