కరోనా పరీక్షల కోసం నిరీక్షణ

ABN , First Publish Date - 2021-04-18T06:19:20+05:30 IST

కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా పరీక్షల కోసం ప్రజలు పెద్దఎత్తున నిరీక్షించాల్సి వస్తోంది.

కరోనా పరీక్షల కోసం నిరీక్షణ
గుంతకల్లులో కరోనా పరీక్షల కోసం వేచి ఉన్న జనం

గుంతకల్లు టౌన, ఏప్రిల్‌ 17: కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా పరీక్షల కోసం ప్రజలు పెద్దఎత్తున నిరీక్షించాల్సి వస్తోంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కోసం ప్రజలు క్యూ కడుతున్నారు. రోజుకు 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. అయితే ప్రతి  రోజు వందకు పైగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారు. ప ట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సిఫారసు ఉన్నవారికి మాత్రం ముందు పరీక్షలు చేసి పంపుతున్నారని వాపోతున్నారు. విధిలేక చాలామంది వెనుదిరగాల్సి వస్తోంది. 


కేజీబీవీలో 149 మంది విద్యార్థులకు పరీక్షలు

యల్లనూరు : మండలంలోని కేజీబీవీ పాఠశాలలో శనివారం 149 మం ది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించినట్లు ఎస్‌ఓ మాధవి తెలిపారు.   వైద్యాధికారి ప్రసాద్‌ మాట్లాడుతూ కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున ముందస్తుగా విద్యార్థులకు పరీక్షలు చేయించామన్నారు. మాస్క్‌లు ధరి స్తూ, భౌతికదూరం పాటించాలని సూచించారు. 


ప్రైవేట్‌ పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించాలి 

రాయదుర్గం రూరల్‌ : కరోనా నిబంధనలను పాటించడంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యాన్ని వీడాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షులు బంగి శివ పేర్కొన్నారు. శనివారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండవ దశ కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్నా పాఠశాలల యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. శనివారం ఒక్కరోజే ఓప్రైవేటు పాఠశాలలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడం విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతోందన్నారు. ఇప్పటికైనా విద్యార్థులు కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 


కరోనా నివారణ అందరి బాధ్యత : సీఐ 

పామిడి : కరోనా నివారణ అందరి బాధ్యత అని సీఐ శ్యామరావు పే ర్కొన్నారు. స్థానిక పోలీసుస్టేషనలో శనివారం ఎస్‌ఐ గంగాధర్‌తో కలిసి ఆ టో, కారు డ్రైవర్లకు కరోనా నివారణపై ఆయన అవగాహన కల్పించారు.  వాహనాలలో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు పెట్టుకునేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. పరిమితికి మించి వాహనాలలో ఎక్కించుకోకూడదన్నారు. సమావేశంలో ఏఎ్‌సఐ వలి, వెంకటస్వామి, హెడ్‌కానిస్టేబుల్‌ సా యిప్రసాద్‌, లక్ష్మినారాయణ, కానిస్టేబుల్‌ జయచంద్రనాయుడు పాల్గొన్నారు.


ఉరవకొండ: మాస్కును తప్పనిసరిగా ధరించాలని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం స్థానిక ఆర్టీసీ గ్యారేజీలో డ్రైవర్లు, కండక్టర్లు గ్యారేజీ సి బ్బందికి కరోనాపై ఆయన అవగాహన కల్పించారు. మాస్కు ధరించని వా హనదారులకు గుంతకల్లు రోడ్డులో కౌన్సెలింగ్‌ ఇచ్చి జరిమానా విధించారు.


కూడేరు : టీకాతోనే కొవిడ్‌ మహమ్మారి నుంచి రక్షణ సాధ్యమని సీహెచఓ మోహనబాబు, సూపర్‌వైజర్‌ నాగేంద్ర ప్రసాద్‌ తెలిపారు. మండ లంలోని అంతరగంగ గ్రామంలో కొవిడ్‌ టీకాపై అవగాహన కల్పించారు.  టీకాపై అపోహలు తొలగించుకోవాలని సూచించారు. 45 సంవత్సరాలు పై బడిన ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎనఎంలు హ నుమక్క, సావిత్రి, ఆశా ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:19:20+05:30 IST